Top Stories

ప్ర‌చారానికి ప‌వ‌న్‌.. వ‌చ్చే ఓట్లూ గోవిందా!


జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో బీజేపీ పొత్తు ఖ‌రారైంది. ఇక సీట్ల విష‌య‌మే ఫైన‌ల్ కావాల్సి వుంది. రేప‌టి నుంచి నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా మొద‌లుకానుంది. దీంతో బీజేపీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఒక‌ట్రెండు రోజుల్లో క‌స‌ర‌త్తు పూర్తి చేయ‌నుంది. ఇప్ప‌టికే 50 మందికి పైగా అభ్య‌ర్థుల‌ను బీజేపీ ప్ర‌క‌టించింది. బీఆర్ఎస్ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ఎంతో ముందుగానే చేసి ప్ర‌చారంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ కూడా దాదాపు అభ్య‌ర్థుల ఎంపిక‌ను పూర్తి చేసింది.

వామ‌ప‌క్షాల సీట్ల‌ను ఖ‌రారు చేయాల్సి వుంది. కాంగ్రెస్ కేవ‌లం 10 సీట్ల‌కు మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల్సి వుంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ , ప్రియాంక‌గాంధీ, ఖ‌ర్గే త‌దిత‌రులు ప్ర‌చారాన్ని వేగ‌వంతం చేశారు. బీజేపీ విష‌యానికి వ‌స్తే ఆ పార్టీ ముఖ్య నాయ‌కుడు ల‌క్ష్మ‌ణ్ గురువారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీ త‌మ మిత్ర ప‌క్షం కాద‌ని ల‌క్ష్మ‌ణ్ స్ప‌ష్టం చేశారు. జ‌న‌సేన మాత్ర‌మే త‌మ మిత్ర‌ప‌క్ష పార్టీగా ఆయ‌న చెప్పుకొచ్చారు. తెలంగాణ‌లో రెండు పార్టీల మ‌ధ్య పొత్తు వుంద‌ని ఆయ‌న తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌చారం చేస్తార‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ నాయ‌కులు తెలంగాణ‌లో రాజ‌కీయ జోక్యం చేసుకుంటే… బీఆర్ఎస్ నేత‌లు వెంట‌నే ప్రాంతీయ సెంటిమెంట్‌ను ర‌గిల్చే సంగ‌తి తెలిసిందే.

మ‌రీ ముఖ్యంగా తెలంగాణ విభ‌జ‌న‌ను త‌ట్టుకోలేక 12 రోజుల పాటు అన్నపానీయాలు ముట్ట‌లేద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆవేద‌న‌తో చెప్పిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలంగాణ‌కు ప‌చ్చి వ్య‌తిరేకి అని చెప్ప‌డానికి ఆయ‌న గతంలో చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోల‌ను తెర‌పైకి తేవ‌డానికి కొన్ని రాజ‌కీయ ప‌క్షాలు సిద్ధ‌మ‌య్యాయి. బీజేపీకి వ‌చ్చే ఓట్లు కూడా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను వెంట‌బెట్టుకుని తిర‌గ‌డం వ‌ల్ల పోతాయ‌నే ఆందోళ‌న ఆ పార్టీ శ్రేణుల్లో వుంది. అస‌లు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో అంట‌కాగాల‌ని ఆలోచ‌న‌… బీజేపీకి పోయే కాలంలో పుట్టిన బుద్ధిగా ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు.



Source link

Related posts

మళ్లీ థియేటర్ల తకరారు మొదలు

Oknews

అమ్మ, అమ్మమ్మల కాలం నాటి గ్లామర్ టిప్స్ నావి

Oknews

షర్మిల అతి.. జగన్ కు మేలు చేస్తుందా?

Oknews

Leave a Comment