అడ్డదారిలో ప్రమోషన్అయితే ప్రణీత్ రావు వ్యవహారంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వంలో పోలీసు శాఖలో నలుగురు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా యాక్సిలరేటెడ్ ప్రమోషన్ పొందినట్లు తెలిసింది. ఈ విషయంపై డీఎస్పీ గంగాధర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అడ్డదారిలో ప్రమోషన్ పొందిన నలుగురు అధికారుల్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(Special Intelligence Branch) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు కూడా ఉన్నారు. నక్సలైట్ ఆపరేషన్స్ లో కీలకంగా వ్యవహరించిన అధికారులకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇస్తారు. అయితే ప్రణీత్ రావు ఎలాంటి నక్సలైట్ ఆపరేషన్ లో పాల్గొనలేదు. అయినా అడ్డదారిలో డీఎస్పీ హోదా పొందారు. ఈ విషయాన్ని డీఎస్పీ గంగాధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కొందరు అధికారులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ ఇచ్చారని గంగాధర్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ నలుగురు అధికారుల ప్రమోషన్ పై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
Source link