ప్రతి తెలుగువాడు గర్వించే రాజధాని అమరావతి
“ప్రతి తెలుగు వాడు గర్వించే రాజధానిగా అమరావతిని తీర్చి దిద్ది, నా రాజధాని అమరావతి అని ప్రతి తెలుగు వాడు చెప్పుకునే విధంగా చేస్తాం. అది మా ప్రభుత్వ కమిట్మెంట్. జగన్ వస్తూనే, ప్రజావేదిక కూల్చివేతతో అమరావతి నాశనానికి అడుగులు వేశాడు. 3 రాజధానులు అంటూ జగన్ రాష్ట్ర పరువు తీశారు. 1631 రోజులు అమరావతి రైతులని, మహిళలని, ఎన్ని రకాలుగా హింస పెట్టొచ్చో, అన్ని రకాలుగా వాళ్లని వైసీపీ ప్రభుత్వం హింసించింది. ఒక వ్యక్తి మూర్ఖత్వం, ఒక వ్యక్తి కక్ష, ఒక వ్యక్తి నిర్ణయాలు, 5 కోట్ల మంది ఆంధ్రులకు శాపాలు అయ్యాయి. రాజధాని నిర్మాణం మధ్యలో ఆపేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. తలుచుకుంటే బాధ.. చేసిన కష్టం మొత్తం వృథా అయ్యే పరిస్థితి.. జాతి ద్రోహం ఇది” – సీఎం చంద్రబాబు