దిశ, ఫీచర్స్ : ప్రతి సంవత్సరం మార్చి 15న ప్రపంచ నిద్ర దినోత్సవం జరుపుకుంటారు. మనిషి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యం. ఒక వ్యక్తి కనీసం 8 నుంచి 9 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. కానీ మారుతున్న జీవనశైలి, నైట్ షిఫ్ట్స్ కారణంగా చాలా మంది సరిగ్గా నిద్రపోవడం లేదు. అయితే సరైన నిద్ర లేకపోతే వ్యక్తి అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.అందువలన తప్పనిసరిగా ఎనిమిది గంటలైనా నిద్రపోవాలి.
కాగా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా హాయిగా నిద్ర పట్టాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
1.నిద్రపోయే ముందు మనసును చాలా రిలాక్స్‌గా ఉంచాలంట, ఇలా చేయడం వలన త్వరగా నిద్ర పడుతుంది.
2. నిద్ర పోవడానికి అరగంట ముందు ఫోన్, టీవీ లాంటిది చూడకూడదు.
3.రాత్రిపూట పడుకునే ముందు కాసిన్ని గోరువెచ్చని పాలు తాగాలి.
4. త్వరగా పడుకోవాలి అంటే ఇంట్లో ఎలాంటి వెలుతురు లేకుండా చూసుకోవాలంట. దీంతో త్వరగా నిద్ర పోతుంది.
5. కొంత మంది నైట్ టైమ్‌లో భోజనం చేయరు. అయితే పడుకోవడానికి రెండు గంటల ముందు కడుపు నిండా తినడం వలన త్వరగా పడుతుందంట.
6.నిద్రపోయే ముందు ఆందోళన, టెన్షన్ పెంచే వాటి గురించి అస్సలే ఆలోచించకూడదు. ధ్యాస అంతా నిద్ర మీద పెట్టాలంట.
7.రాత్రిళ్లు తల పక్కన మొబైల్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు.
8.రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం చాలా ముఖ్యం.