ఎవరితో అయినా పెట్టుకోవచ్చు గాని ప్రభాస్ (prabhas)ఫ్యాన్స్ తో పెట్టుకోకూడదనే నానుడి సినీ సర్కిల్ లో ఉంది. పైగా ఇప్పుడు వాళ్లంతా కల్కి టికెట్స్ దొరకడంలేదనే టెన్షన్ తో ఉన్నారు. ఏకంగా కల్కి ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ ఆఫీస్ ముందు కూర్చొని టికెట్ల కోసం దీక్ష కూడా చేస్తున్నారు. ఈ టైం లో ఒక సినీ మేధావి చెప్పే మాటలు వాళ్ళకి చిరాకుని తెప్పిస్తున్నాయి.
త్రిపురనేని మహారథి(tripuraneni maharathi) తెలుగు సినీ కళామ తల్లి ముద్దు బిడ్డ. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆయన మేధస్సు నుంచి పురుడు పోసుకున్నాయి.కథ, మాటల, పాటల రచయితగా నిర్మాత గా ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆయన గొప్ప తనం చెప్పుకోటానికి సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు మూవీ ఒక్కటి చాలు. ఆయన రచనతో అమృతత్వాన్ని దక్కించుకుంది. మొత్తం నూటయాబై సినిమాలకి రచనా బాధ్యతలు అందించాడంటే తెలుగు సినిమాకి మహారథి చేసిన కృషి ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అంతటి ఘన కీర్తి కలిగిన వ్యక్తి కుమారుడు త్రిపురనేని చిట్టి. దర్శకుడు గా నిర్మాతగా కొన్ని సినిమాలు చేసాడు. కానీ పెద్దగా ప్రేక్షకాదరణకి నోచుకోలేదు. తాజాగా ఆయన ఒక టీవీ ఛానల్ చర్చలో పాల్గొని కల్కి టికెట్ రేట్ ఎందుకు పెంచారని వెంటనే తగ్గించాలని కోరాడు. ఆయనతో డిస్కర్షన్ లో కూర్చున్న ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతు ప్రస్తుత రోజుల్లో సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. పైగా కల్కి లాంటి సినిమాలకి ఇంకా బడ్జట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి పెంచడం కరెక్ట్ అని చెప్పాడు.పైగా కల్కి వన్ వీక్ దాకా హౌస్ ఫుల్ అయ్యింది. కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేసారని చెప్పాడు.
అయినా సరే చిట్టి మాత్రం తన వాదనని ఆపలేదు. మరి గత ప్రభుత్వం కావాలని చెప్పి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలకి కేవలం ఐదు రుపాయిలకే టికెట్ పెట్టినప్పుడు మీరు ఎందుకు అడగలేదని చిట్టి ని అడిగారు.దానికి మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే బాబు చిట్టి నువ్వు సైలెంట్ గా ఉంటే మంచిది లేదంటే ఛత్రపతులం అవ్వాల్సి వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య అండ్ పవన్ ఫ్యాన్స్ కూడా తమ స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.