ఎందరో మహానుభావులు అందరికి వందనాలని ఒక ప్రముఖ రచయిత ఊరకనే రాయలేదు. కాకపోతే ఆయన రాసిన ఉద్దేశ్యం వేరు. కానీ ఇప్పుడు ఆ మహానుభావులందరూ కలిసి ప్రభాస్(prabhas) కల్కి (kalki 2898 ad)మీద పడ్డారు. వాళ్ళేం చేసారో చూద్దాం.
ఆదివారం రోజున యధావిధిగా వరల్డ్ వైడ్ గా కల్కి షోస్ పడ్డాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ పంజాగుట్ట లో ఉన్న పీవీఆర్ లో కూడా షో పడింది. థియేటర్ హౌస్ ఫుల్ కూడా అయ్యింది. అందరు కల్కి లో లీనమయ్యారు. ఆ తర్వాత ఒక్కసారిగా థియేటర్ లో వర్షం స్టార్ట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా అందరు షాక్ కి గురయ్యారు. చాలా మంది థియేటర్ నుంచి బయటకి వచ్చారు. కానీ యాజమాన్యం మాత్రం షో ని ఆపకుండా కంటిన్యూ చేసింది. దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రేక్షకులు గొడవకి దిగారు. అప్పటికి కూడా యాజమాన్యం షో ని ఆపలేదు.
పైగా మీకు ఇష్టముంటే చూడండి లేదా వెళ్లిపోవచ్చంటూ రెక్లెస్ గా సమాధానం ఇచ్చింది. దీంతో ప్రేక్షకులు పోలీసులకి కంప్లైంట్ చెయ్యడంతో షో ఆగిపోయింది. మా డబ్బులు మాకు ఇవ్వమని ప్రేక్షకులు గొడవ కూడా చేసారు.
ఇప్పుడు ఈ సంఘటన షోషల్ మీడియాలో ప్రత్యక్ష మవ్వడంతో హైదరాబాద్ లాంటి మహా నగరంలో అది కూడా పివీఆర్ లాంటి మల్టిప్లెక్స్ లో వర్షం కురవడం ఏంటని మాట్లాడుకుంటున్నారు.నగరంలో భారీ వర్షాలు కురుస్తుంటే జాగ్రతలు తీసుకోవాలి కదా అని అంటున్నారు. ఇక కల్కి ప్రభంజనం అయితే అన్ని చోట్ల యధావిధిగా కొనసాగుతుంది. ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. మా ప్రభాస్ రికార్డులని క్రాస్ చేసే సత్తా మళ్ళీ మా ప్రభాస్ కి మాత్రమే ఉందంటున్నారు.