EntertainmentLatest News

ప్రభాస్‌ కు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపిన ‘కన్నప్ప’ టీం


మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో ప్రతీ ఇండస్ట్రీలోని స్టార్ హీరో భాగస్వామి అవుతున్నారు. తెలుగు నుంచి ప్రభాస్, కన్నడ నుంచి శివ రాజ్ కుమార్, కేరళ నుంచి మోహన్ లాల్ ఇలా ఎందరో స్టార్లు కన్నప్ప చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించనున్నారు. దీంతో ఈ చిత్రంపై నేషనల్ వైడ్‌గా హైప్ పెరిగింది.

ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23) సందర్భంగా కన్నప్ప టీం డార్లింగ్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపింది. “ప్రభంజనమై ప్రేక్షక హ‌ృదయాలను మనసుతో, వ్యక్తిత్వంతో, నటనతో గెలుచుకుని.. ప్రపంచమంతా శభాష్ అనిపించుకుంటున్న మా ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు.. శతమానం భవతి శత శత మానం భవతి” అంటూ కన్నప్ప స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం చేశారు. ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది.



Source link

Related posts

తాడోపేడో తేల్చుకుంటారా..లేక కాంప్రమైజా

Oknews

Rashmika Mandanna Cool Look in Summer సమ్మర్‌లో తన గర్ల్‌తో రష్మిక కూల్ లుక్

Oknews

Megastar big donation for Janasena జనసేనకు చిరు భారీ విరాళం..!

Oknews

Leave a Comment