EntertainmentLatest News

ప్రభాస్ చేసిన తప్పే ఎన్టీఆర్, చరణ్ చేస్తున్నారా?


‘బాహుబలి’తో ప్రభాస్(Prabhas) పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ సినిమాకి హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ మూవీ సౌత్ లో చేతులెత్తేసినప్పటికీ.. నార్త్ లో మాత్రం మంచి వసూళ్లతో సత్తా చాటింది. గత కొన్నేళ్లుగా గమనిస్తే.. తమకి నచ్చేలా ఉంటే, సౌత్ నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమాలను కూడా నార్త్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారనేది వాస్తవం. అయినప్పటికీ.. పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న మన హీరోలు ఎందుకనో నేరుగా హిందీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా చేశాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో పాటు, ప్రభాస్ స్టార్డం తోడవ్వడంతో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టినప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గానే మిగిలింది. పైగా దారుణమైన ట్రోల్స్ ని ఎదుర్కొంది. దీంతో బాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయొద్దని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా కోరుతున్నారు. ప్రభాస్ సైతం ప్రస్తుతం తన సినిమాలన్నీ సౌత్ డైరెక్టర్స్ తోనే చేస్తున్నాడు. అయితే బాలీవుడ్ అంటూ ‘ఆదిపురుష్’ రూపంలో ప్రభాస్ చేసిన తప్పునే.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్(Jr NTR).. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీని తర్వాత ‘వార్-2’ అనే బాలీవుడ్ ఫిల్మ్ చేయనున్నాడు తారక్. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందనున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. తారక్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంతలా తన నటనతో డామినేట్ చేసినప్పటికీ.. హిందీ హీరో హృతిక్ రోషన్ ని కాదని, ఆయన పాత్రని మించేలా పవర్ ఫుల్ గా ఎన్టీఆర్ పాత్రని మలచరు అనేది వాస్తవం. అదే జరిగితే ఎన్టీఆర్ వంటి బిగ్ స్టార్ కి అది అవమానమే అవుతుంది. ఇక ఈ సినిమా హిట్ అయినా.. మల్టీస్టారర్ కాబట్టి తారక్ కి పూర్తి క్రెడిట్ దక్కదు. ఒకవేళ ఫ్లాప్ అయినా, ఎన్టీఆర్ రోల్ తేలిపోయినా.. అనవసరంగా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓ రకంగా ‘వార్-2’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ.. ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి.

ఇక ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్టార్ గా మారిన మరో హీరో రామ్ చరణ్(Ram Charan) పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్న చరణ్.. తన తదుపరి సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్నాడు. దాని తర్వాత దర్శకుడు సుకుమార్ తో ఒక సినిమా చేసే అవకాశముంది. ఇదిలా ఉంటే తాజాగా చరణ్ ఓ బాలీవుడ్ ఫిల్మ్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దర్శకుడిగా భన్సాలీ ఎంతో ప్రతిభావంతుడు. పలు క్లాసిక్ చిత్రాలను అందించాడు. అయితే ఆయన ఒక్కో సినిమాకి ఎక్కువ సమయం తీసుకుంటాడనే పేరుంది. పైగా ఆయన కొన్నేళ్లుగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలనే చేస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గత కొన్ని చిత్రాలను గమనిస్తే హీరోని డామినేట్ చేసేలా హీరోయిన్ పాత్ర ఉంటుంది. పైగా భన్సాలీ ఎంచుకునే కథలు, నెమ్మదిగా సాగే కథనాలు సౌత్ ప్రేక్షకులను మెప్పించేలా ఉండవు. ఆయన సినిమాలు నార్త్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఎక్కువగా ఉంటాయి. అలాంటి భన్సాలీతో రామ్ చరణ్ సినిమా చేస్తే.. ఒకవేళ హిట్ అయినా హీరోగా రావాల్సినంత క్రెడిట్ రావడం అనుమానమే. అలాగే భన్సాలీ సినిమాతో సౌత్ ప్రేక్షకులను మెప్పించడం కష్టమనే అభిప్రాయాలు ఉన్నాయి.



Source link

Related posts

హీరో  గోపీచంద్  గురించి మాట్లాడనున్న తెలంగాణ మంత్రి సీతక్క   

Oknews

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

Oknews

'రాజధాని ఫైల్స్' ప్రెస్ మీట్ లో హృదయాన్ని హత్తుకునే దృశ్యం!

Oknews

Leave a Comment