ఏమైనా సరే.. బాహుబలి ప్రభాస్ ది బాగా పెద్ద చెయ్యి. షూటింగ్ స్పాట్ లో అన్నం పెట్టినా అలాగే, కష్టం వచ్చినపుడు సాయం చేసినా అలాగే. బాహుబలి తరువాత తన అవసరం వచ్చిన ప్రతి సారీ ప్రభాస్ భారీగా విరాళాలు ప్రకటిస్తూ వస్తున్నాడు.
ఇప్పుడు కూడా అంతే భారీగా ప్రకటించాడు కేరళ సీఎం సహాయనిధికి రెండు కోట్ల విరాళం అందించాడు. ఇది చాలా పెద్ద మొత్తం.
టాలీవుడ్ లో కేరళ కు సహాయం అందించిన తొలి హీరో బన్నీ. పాతిక లక్షలు అందించాడు. తరువాత మెగాస్టార్ చిరు, ఆయన తనయుడు ఇద్దరూ కలిపి కొటి రూపాయలు అందించారు. అంటే చెరో యాభై లక్షలు అనుకోవాలి. ఇప్పుడు ప్రభాస్ రెండు కోట్లు ప్రకటించారు.
ఇండియాలో టాప్ హీరో అనుకోవాల్సిందే ప్రభాస్ ను. ఎందుకంటే బాలీవుడ్ హీరోల కలెక్షన్లను దాటేసాడు. ప్రభాస్ సినిమా యావరేజ్ అయితే చాలు వందల కోట్ల కలెక్షన్లు వస్తున్నాయి. కల్కి మాదిరిగా బ్లాక్ బస్టర్ అయితే చెప్పనక్కరలేదు.
వంద కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకునే హీరో రెండు కోట్లు ఇవ్వడం ఎక్కువ కాదు. కానీ అలా వంద కోట్ల రెమ్యూనిరేషన్, వందలు, వేల కోట్ల ఆస్తులు వున్న హీరోలు తెలుగులో చాలా మంది వున్నారు. కానీ వారెవ్వరూ ఇవ్వలేనిది ప్రభాస్ ఇస్తాడు. అందుకే ప్రభాస్.. బాహుబలి.. దానం లో కూడా.
The post ప్రభాస్.. దాతృత్వంలో బాహుబలి appeared first on Great Andhra.