EntertainmentLatest News

ప్రభాస్ ది ఏడవ ప్లేస్ కాదు no 1 స్థానమే.. ప్రూఫ్ కూడా ఉంది 


తెలుగు సినిమా హీరోకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన హీరో ప్రభాస్. ఈ రెబల్ స్టార్ దెబ్బకి ఇప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తం షేక్ అవుతుంది. ఎంతలా అంటే ప్రభాస్ సినిమా రిలీజ్ రోజు తమ సినిమా రిలీజ్ చేయనంతలా.ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్ లేదు. బాహుబలి తో మొదలయిన ప్రభాస్ ఫోబియా మొన్నటి సలార్ వరకు కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా ప్రభాస్ కి సంబంధించిన  న్యూస్ ఒకటి ఇండియా వైడ్ గా సంచలనం సృష్టిస్తుంది.

సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ట్రెండ్స్ కి సంబంధించిన  రిపోర్ట్ ఒకటి వచ్చింది. గత ఏడాది 2023 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 వరకు ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలో అయిన  టాప్ పది మంది జాబితాని ప్రకటించింది. ఇందులో ఇండియా  వైడ్ గా  ట్రెండ్ అయ్యిన ఒకే ఒక్క వ్యక్తిగా ప్రభాస్  నిలిచాడు. వాస్తవానికి ప్రభాస్ ఏడవ స్థానంలో నిలిచాడు.మొదటి ఆరు స్థానాల్లో కొన్ని సినిమాలతో పాటు కొన్ని సంస్ధల పేర్లు ఉన్నాయి. కానీ పర్సన్స్ పరంగా మాత్రం  ప్రభాసే మొదటి స్థానం. ఇప్పుడు ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోతున్నాయి. అలాగే  ఇండియా వైడ్ గా ప్రభాస్ కి ఉన్నక్రేజ్ మరోసారి అందరకి తెలిసొచ్చినట్టుగా కూడా అయ్యింది

ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898  ఏడి ,రాజాసాబ్ సినిమాల్లో చేస్తున్నాడు. వీటిల్లో కల్కి చాలా భాగం షూటింగ్ ని పూర్తి చేసుకుంది.  మే 9 న ఆ మూవీ  విడుదల కాబోతుంది.  రాజా సాబ్ కూడా ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి ప్రభాస్ విజృంభణ ఈ సంవత్సరం కూడా ఉండబోతుందని అర్ధం అవుతుంది.సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్, ప్రశాంత్ నీల్ తో సలార్ 2  కూడా డార్లింగ్ ఖాతాలో ఉన్నాయి.హను రాఘవపూడి మూవీ కూడా ఉండనుంది 

 



Source link

Related posts

దుల్కర్‌ సల్మాన్‌ ఆ సినిమాకి ప్లస్‌ అవుతాడా?

Oknews

Police Encountered four Maoists in Gadchiroli district | Maoists killed In Gadchiroli: గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌

Oknews

టిల్లు స్క్వేర్ వీక్ కలెక్షన్స్..అందరు షాక్ 

Oknews

Leave a Comment