Entertainment

ప్రభాస్‌ బర్త్‌డే వచ్చేస్తోంది.. ఈసారి సెలబ్రేషన్స్‌ ఎక్కడో తెలుసా?


సాధారణంగా హీరోల పుట్టినరోజు వేడుకలను ఎంతో గ్రాండ్‌గా చేసుకుంటారు అభిమానులు. ఆ తరం హీరోల అభిమానుల నుంచి ఇప్పటి యంగ్‌ హీరోల అభిమానుల వరకు తమ హీరో పుట్టినరోజును ఒక పండగగానే భావిస్తారు. దానికి తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేయడం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వాస్తవానికి పాతతరం హీరోలకు జరిగినట్టుగా ఈ తరం హీరోలకు పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం అభిమానుల్లో తక్కువైందనే చెప్పాలి. అయినప్పటికీ కొంతమంది వీరాభిమానులు తమ హీరో పుట్టినరోజును గ్రాండ్‌గా చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

అక్టోబర్‌ 23న పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు. తమ హీరో పుట్టినరోజును వైభవంగా జరుపుకునేందుకు అభిమానులు ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకుంటున్నారు. అయితే ఈ పుట్టినరోజుకు ప్రభాస్‌ ఇండియాలో ఉండడం లేదు. మోకాలికి సర్జరీ చేయించుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం యూరప్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ ఏడాది తన బర్త్‌డేను అక్కడే జరుపుకోవాలని డిసైడ్‌ అయ్యాడట. తన స్నేహితులను, సన్నిహితులను, కుటుంబ సభ్యులను యూరప్‌కే పిలుపించుకొని వారి సమక్షంలోనే తన బర్త్‌ డే జరుపుకోవాలనుకుంటున్నాడు ప్రభాస్‌. అరోజు తన బర్త్‌ డే స్పెషల్‌గా తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా రాబోతున్నాయి. 

ప్రభాస్‌ బర్త్‌ డే స్పెషల్‌గా కొత్త సినిమాల అప్‌డేట్స్‌ను రెడీ చేస్తున్నారు. ‘సలార్‌’ నుంచి ఓ స్పెసల్‌ గ్లింప్‌ రాబోతోంది. అలాగే ‘కల్కి’ నుంచి కూడా అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రభాస్‌, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా ప్రభాస్‌ పుట్టినరోజునే రిలీజ్‌ చేస్తారట. 



Source link

Related posts

సమంత  అమెరికాలో అవి తింటుందా? 

Oknews

ఓటీటీలోని ఈ మూడు వెబ్ సిరీస్ లు అస్సలు మిస్ అవ్వకండి!

Oknews

లోకేష్‌ సినిమాలో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టిన బ్రహ్మాజీ!

Oknews

Leave a Comment