అనాదిగా ఒక సామెత చిరంజీవిగా వర్ధిల్లుతూ ఉంది. ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించి పెట్టేవి రెండే రెండు. ఒకటి సినిమా, రెండు క్రికెట్ అని.. ఇందుకు ఉదాహరణల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. డైలీ అందరు చూస్తుందే. ఆ విధంగా ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన హీరో రిషబ్ శెట్టి( rishab shetty)కాంతార తో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా లెవల్లో తన పేరు మారుమోగిపోయింది. తాజాగా ఆయన ప్రభాస్ బుజ్జి నాకు కూడా సొంతం అంటున్నాడు. అదేంటో చూద్దాం.
ప్రభాస్ (prabhas)బుజ్జి (bujji)ఇప్పుడు ఇండియా వైడ్ గా షికార్లు చేస్తుంది. పలువురు సినీ సెలబ్రిటీలు బుజ్జిని డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సరసన రిషబ్ శెట్టి కూడా చేరాడు. తాజాగా రిషబ్ బుజ్జిని డ్రైవ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోని కల్కి టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు అది వైరల్ అవడంతో పాటు ట్రెండ్ అవుతు ఉంది. రిషబ్ ప్రస్తుతం కాంతార 2 ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.