Entertainment

ప్రభాస్‌ సినిమా ఇక పెద్దలకు మాత్రమే.. క్లారిటీ ఇచ్చిన సందీప్‌రెడ్డి!


‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్‌రెడ్డి వంగా ఆ సినిమాతో ఎంతటి సంచలనం సృష్టించాడో అందరికీ తెలిసిందే. ఒక హీరోని అలా కూడా ప్రజెంట్‌ చేసి బ్లాక్‌బస్టర్‌ సాధించవచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఆ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాను హిందీలో ‘కబీర్‌సింగ్‌’గా రీమేక్‌ చేసి బాలీవుడ్‌కి కూడా తన మార్క్‌ని ఇంట్రడ్యూస్‌ చేశాడు. హీరో క్యారెక్టరైజేషన్‌ ఎక్స్‌ట్రీమ్‌లో ఉండడమే కాకుండా ఆడియన్స్‌ ఊహకందని ట్విస్టులతో ఇండియన్‌ సినిమాను కొత్త పుంతలు తొక్కించాడు. 

గత సంవత్సరం రణబీర్‌కపూర్‌తో సందీప్‌ చేసిన ‘యానిమల్‌’ చిత్రంలో ఆ డోస్‌ని మరికాస్త పెంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. రణబీర్‌ కపూర్‌ను తనదైన స్టైల్‌లో ప్రజెంట్‌ చేసి అతని ఇమేజ్‌ని ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమా రూ.900 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. సందీప్‌ విజన్‌కు, రణబీర్‌ పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. సినిమాలోని బోల్డ్‌ కంటెంట్‌, మితిమీరిన హింస కొందరిని ఇబ్బంది పెట్టాయి. ఈ తరహా  సినిమాలతో యూత్‌కి ఎలాంటి మెసేజ్‌ ఇద్దామనుకుంటున్నారనే  విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వీటితో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ దగ్గర తన జోరును చూపించింది ‘యానిమల్‌’.

ఇప్పుడు అందరి దృష్టీ సందీప్‌ తర్వాతి సినిమా ‘స్పిరిట్‌’పైనే ఉంది. డార్లింగ్‌ ప్రభాస్‌ను ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నాడన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. దీంతో ప్రారంభానికి ముందే సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్‌రెడ్డి ‘స్పిరిట్‌’ ఎలా ఉండబోతోందనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా తన గత సినిమాలకంటే మరింత బోల్డ్‌గా, డార్క్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ఒక డిఫరెంట్‌ విజన్‌తో ఈ సినిమా ఉంటుందట. ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని ఒక కథాంశాన్ని తన స్టైల్‌లో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు సందీప్‌. 

ఈ సినిమాకి సంబంధించి మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ముందుగానే ప్రకటించాడు సందీప్‌. ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే అని చెబుతున్నాడు. తన గత సినిమాల్లో లవ్‌ సీన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ ఎంత ఎక్స్‌ట్రీమ్‌గా ఉన్నాయో మనం చూశాం. వాటి వల్లే ఆ సినిమాలకు సెన్సార్‌ ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఆ సినిమాలను మించే స్థాయిలో ‘స్పిరిట్‌’ ఉంటుందని సమాచారం. కేవలం పెద్దలను మాత్రమే టార్గెట్‌ చేస్తూ తన సినిమాలు ఉంటాయని ‘స్పిరిట్‌’తో మరోసారి ప్రూవ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాడు సందీప్‌. సినిమాను సెన్సార్‌ చూసి పెద్దలకు మాత్రమే అని సర్టిఫై చెయ్యడం కాదు, ముందుగానే తన సినిమా పెద్దల కోసం మాత్రమేనని అందర్నీ ప్రిపేర్‌ చేస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభాస్‌తో చేసే ‘స్పిరిట్‌’ చిత్రం రా అండ్‌ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా ఉండబోతోందని స్పష్టమవుతోంది.



Source link

Related posts

Ram Charan releases Ramaraju for Bheem teaser

Oknews

The Platform Review : ఆహారం విలువ చెప్పే సినిమా.. ఓటీటీలో మోస్ట్ డిస్టబింగ్ సినిమా!

Oknews

హీరో ధనుష్ వీళ్ళ అబ్బాయే.. కోర్టు తీర్పు  

Oknews

Leave a Comment