ఆరు జోన్లలో అడ్మిషన్లు…
ఏపీలో మొత్తం ఆరు యూనివర్శిటీ ఏరియాల వారీగా అడ్మిషన్లను చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఓ యూనిట్‌గా, విశాఖపట్నం అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు మరో యూనిట్‌గా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఒక యూనిట్‌లో, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు మరో యూనిట్‌లో అడ్మిషన్లు చేపట్టారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాకు ఒక యూనిట్, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అనంతపరం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు మరో యూనిట్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు మరో విభాగంలో అడ్మిషన్లను చేపట్టారు.