ఆమె ఆరేళ్ళ వయసు నుంచే పాడటం ప్రారంభించింది.ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఐదు భాషల్లో ఇరవై వేలకు పైగా పాటలు పాడింది.ఏడు సార్లు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ హోదాలో ఫిలింఫేర్ అవార్డులు తీసుకుంది. రెండు సార్లు నేషనల్ అవార్డులు కూడా అందుకుంది. అంతటి గౌరవాన్ని దక్కించుకున్న ఆ సింగర్ ఎవరో కాదు అల్కా యాగ్నిక్( alka yagnik)ప్రెజంట్ ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
ఇయర్ ఫోన్స్ వాడటం కారణంగా నా చెవులకి వైరల్ ఎటాక్ అయ్యింది.కొన్ని రోజుల క్రితం విమానం దిగి వస్తుండగా సడెన్ గా నాకేమి వినిపించలేదు. దీంతో డాక్టర్ ని సంప్రదించాను. నాకు హియరింగ్ లాస్ అనే వ్యాధి వచ్చినట్టు చెప్పారు. నా జీవితంలో ఇది నాకు పెద్ద ఎదురు దెబ్బ. నాకు తెలియకుండానే దీని బారిన పడ్డాను.నా అభిమానులకి సహచరులకి ఒక్కటే చెప్తున్నాను. దయచేసి పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వినకండి. ఇయర్ ఫోన్స్ వాడకంలో కూడా జాగ్రత్త వహించండి .అలాగే వృత్తి పరమైన జీవితం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తాయి.వాటి గురించి త్వరలోనే చెప్తాను. అదే విధంగా నేను కొన్ని రోజుల నుంచి కనపడటం లేదనే వార్తలు వస్తున్నాయి. దాంతో నా అభిమానులు చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వారందరకీ ఈ మెసేజ్ తో ఊరట లభిస్తుంది. దయచేసి నా కోసం మీరంతా ప్రార్థన చేయండి అని మెసేజ్ చేసింది.
ఇక అల్కా యాగ్నిక్ పోస్ట్ కి చాలా మంది సినీ సెలెబ్రెటీస్ రిప్లై లు ఇస్తున్నారు. ఏఆర్ రెహమాన్, శంకర్ మహదేవన్, సోనునిగమ్ లాంటి వాళ్ళు ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. బాలీవుడ్ మహిళా సింగర్స్ విభాగంలో అత్యధిక సోలో సాంగ్స్ పాడిన వాళ్ళ జాబితాలో ఆల్కా మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో లతా మంగేష్కర్, ఆశ బొంస్లే ఉన్నారు. 1980 లో వచ్చిన పాయల్ కి జన్ కర్ అనే మూవీకి మొదటిసారి తన గళాన్ని అందించింది. తేజాబ్ (tejaab)లో ని ఏక్ తో తీన్ చార్ పంచా చే సాథ్, ఖల్ నాయక్ (khal nayak)లోని చోళీకే పీచే క్యాహై ,చైనా గేట్ లోని చమ్మ చమ్మ సాంగ్స్ తో ఇండియా వైడ్ గా క్రేజ్ వచ్చింది. ఇలాంటి ఎన్నో హిట్ పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2002 లో తెలుగులో వచ్చిన మనసుతో మూవీలో కూడా ఒక పాట పాడింది.