నాసామి రంగ తో చాలా సంవత్సరాల తర్వాత నాగ్ ఖాతాలో ఒక మంచి హిట్ పడింది.ఆ సినిమాలో నాగార్జున నటనకి ఎంత పేరు వచ్చిందో హీరోయిన్ ఆషిక రంగనాధ్ నటనకి అంతే పేరు వచ్చింది. తాజాగా ఈ అమ్మడికి చెందిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
ఆషికా అక్క పేరు అనూష రంగనాధ్. కన్నడ సినిమా పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందుతున్నఅనూష వివాహం ఇటీవలే జరిగింది. బెంగుళూర్ లో ఎంతో వైభవంగా జరిగిన ఈ వివాహానికి సంబంధించిన పిక్స్ ని ఆషికా సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. వాటిని చూసిన వాళ్ళందరు అక్క పెళ్లి అయిపొయింది కాబట్టి మరీ ఆషికా పెళ్లి ఎప్పుడంటు కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే వరుడు ఎవరనే విషయం మాత్రం ఆషికా వెల్లడి చెయ్యలేదు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యి వధూవరులిద్దరికీ తమ శుభాకాంక్షలు తెలియచేసారు.
కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఆషికా నా సామి రంగ తో అందరి మనసులని దోచుకుంది. ప్రేమించిన వ్యక్తి కోసం తండ్రిని ఎదిరించి ఆ తర్వాత తండ్రి ఆత్మహత్యతో ప్రేమించిన వ్యక్తి ని పెళ్లి చేసుకోలేక అతని మీద ప్రేమని చంపుకోలేక కన్యగా మిగిలిపోయే క్యారక్టర్ లో ఆషికా సూపర్ గా నటించింది.