Entertainment

ప్రముఖ హీరో భార్య డెలివరీ… అయోధ్య రాముడ్ని గుర్తుచేసుకుంటు ఆనందం 


జనవరి 22 అనే తేదీప్రతి భారతీయుడి గుండెల్లో  మర్చిపోలేని ఒక అధ్బుతమైన  రోజుగా గుర్తుండిపోతుంది. తను పుట్టిన ఏలిన అయోధ్య లో ఆ శ్రీరామచంద్రుడికి నేడు స్థిరనివాసం ఏర్పడింది. తన ధర్మపత్ని సీతమ్మతల్లి, అగ్రజుడు లక్ష్మణుడు, అనుచరుడైన ఆంజనేయుడు తో కలిసి రామ్ లల్ల  అయోధ్య లో ప్రాణ ప్రతిష్ట గావించాడు. ఇలాంటి పర్వదినాన తెలుగు చిత్ర సీమకి చెందిన ఒక హీరో తండ్రి అవ్వడం ఇప్పుడు  ప్రాధానత్యని  సంతరించుకుంది.

తెలుగులో ఎన్నో చిత్రాల్లో సపోర్టింగ్ అండ్ కామెడీ రోల్స్ చేసి కలర్ ఫొటోతో హీరోగా మారి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్. ఈ రోజు ఆయన భార్య లలిత  పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సుహాస్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకొని తన ఆనందాన్ని వెల్లడి చేసాడు.పైగా తన కొడుకుని ఉద్దేశించి ప్రొడక్షన్ నెంబర్ 1 అనే క్యాప్షన్ కూడా పెట్టడం చాలా ఫన్నీగా ఉంది. అలాగే  అయోధ్య లో రామ విగ్రహానికి ప్రాణ ప్రతిష్టాపన జరుగుతున్న రోజున తమ  బిడ్డ ఈ భూమ్మీదకి రావడం పట్ల సుహాస్ దంపతులు ఎంతో ఆనందంతో ఉన్నారు.

సుహాస్ హీరోగా చేసిన అంబాజీ పేట మ్యారేజ్ బ్రాండ్ అనే మూవీ  ఫిబ్రవరి 2 న విడుదల కాబోతుంది. గత ఏడాది రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో వచ్చి ఒక మోస్తరు విజయాన్ని అందుకున్న సుహాస్ తన నూతన చిత్రం  అంబాజీ పేట మ్యారేజ్ బ్రాండ్ తో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.



Source link

Related posts

మొదటిసారి మిల్కీ బ్యూటీ అలా.. రచ్చ రచ్చే!

Oknews

ప్రభాస్ కి త్రిష నిజమేనా!

Oknews

తన పుట్టినరోజున థియేటర్లలో సందడి చేయనున్న ప్రభాస్‌

Oknews

Leave a Comment