మెట్రో ప్రయాణాల్లో డిస్కౌంట్లు కీలకంపెరుగుతున్న ఉష్ణోగ్రతలతో హైదారాబాద్ వాసులు మెట్రో(Hyderabad Metro)ను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. చాలా మంది ప్రయాణికులు తమ రోజువారీ ప్రయాణాలకు మెట్రోపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. సెలవు దినాల్లో రూ. 59తో రోజంతా ప్రయాణించే విధంగా మెట్రో హాలిడే కార్డును(Metro Holiday Card) తీసుకొచ్చింది. ఈ హాలిడే కార్డు ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో అందుబాటులో ఉండేది. సాధారణ రోజుల్లో ఉండే మెట్రో కార్డుపై ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఇచ్చే 10 శాతం రాయితీ ఇస్తారు. ఈ రాయితీలను మెట్రో మరో ఆరు నెలలు పొడిగించింది. డిస్కౌంట్లు, హాలిడే కార్డును పునరుద్ధరించాలని ప్రయాణికులు మెట్రో అధికారులకు విజ్ఞప్తి చేశారు. రోజువారీ ప్రయాణికులకు డిస్కౌంట్లు కీలక పాత్ర పోషిస్తాయని పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు.
Source link
previous post