2019కు ముందు ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్, చంద్రబాబు కోసం ఢిల్లీలో సిద్ధం చేసిన నంబర్ 1, జన్‌పథ్ క్వార్టర్‌ను జగన్మోహన్ రెడ్డి కోసం బదలాయించి ప్రసన్నం చేసుకున్నారు. ఢిల్లీలో తాను పనులు చక్కబెడతానని చెప్పుకుని ఏపీ సిఎంఓలో అంతులేని అధికారాన్ని అనుభవించారు.