తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అందరికి తెలుసు. తెలుగు సినిమా హీరో స్థాయి నుంచి భారతీయ సినిమా హీరో స్థాయికి ఎదిగి ఐకాన్ స్టార్ అనే హోదాలో అల్లు అర్జున్ నేడు ఉన్నాడు. భాష తో సంబంధం లేకుండా అన్ని భాషల్లోను బన్నీకి ఫాన్స్ ఉన్నారు. బన్నీ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్ ల దగ్గర సినిమా రిలీజ్ ముందు రోజు నుంచే అభిమానుల హంగామా మొదలవుతుంది. బన్నీఅంటే ఆయన అభిమానులకి దైవం తో సమానం.అలాగే బన్నీ ని ఎంత అభిమానంగా ప్రేమిస్తారో బన్నీ వైఫ్ ని పిల్లల్ని కూడా ఫాన్స్ అంతే అభిమానంతో ప్రేమిస్తారు. అలాగే బన్నీ కి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవడం కోసం సోషల్ మీడియా ని అభిమానులు ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా బన్నీ వైఫ్ స్నేహ తన సోషల్ మీడియా లో ఉన్న ఒక కొటేషన్ ని షేర్ చెయ్యడంతో ఒక్కసారిగా బన్నీ అభిమానులతో పాటు సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళల్లో సంచలనం సృష్టిస్తుంది.
అల్లు అర్జున్ ,స్నేహ లది ఎంతో చక్కని జంట. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. అల్లు అర్జున్ ,స్నేహ ఇద్దరు ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ అభిమానుల కోసం తమ పర్సనల్ ఫొటోస్ తో పాటు పిల్లలకి సంబంధించిన క్యూట్ ఫొటోస్ ని పెడుతూ అభిమానులలో ఆనందాన్ని నింపుతారు. అలాగే ఇటీవల స్నేహ బర్త్డే డే సందర్భంగా బన్నీ స్నేహ కి బర్త్ డే విషెస్ చెప్పిన వీడియోస్ కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అలాగే ఇటీవలే ఇద్దరు లండన్ లో స్నేహ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ ని జరుపుకొని బాగానే ఎంజాయ్ చేసి వచ్చారు.
ఆ విషయాలన్నీ అటు ఉంచితే స్నేహ యొక్క ఇన్ స్టా స్టోరీలో తాను ప్రేమలో ఉన్నా లేకపోయినా కూడా శాంపైన్ తాగుతాను అనే ఒక కొటేషన్ ఉంది.ఇప్పుడు స్నేహ ఆ కొటేషన్‌ని షేర్ చేసింది. అంటే తాను షేర్ చేసిన దాని ప్రకారం తాను కూడా షాంపైన్ తాగుతాను అని, ప్రేమలో ఉన్నా లేకపోయినా కూడా తాగుతాను అని చెప్పకనే చెప్పినట్టుగా ఉంది. అల్లు స్నేహా తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఈ కొటేషన్ మాత్రం ప్రెజెంట్ ఫుల్ వైరల్ లో ఉంది.