రూ. 10 లక్షలు కట్నం తీసుకురావాలంటూ వేధింపులుఅత్తింటివారు, భర్త, మరిది వెంకటేష్ కలిసి రూ. 10 లక్షలు కట్నం తీసుకరావాలంటూ ఆమనిపై మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయంలో ఆమని తల్లిదండ్రులు పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి నచ్చజెప్పారు. అయినా భర్త హరీష్ లో మార్పు రాలేదు. కాగా సంవత్సరన్నర బాబు ఉండడంతో ఆమని ఇంతకాలం వేధింపులను భరిస్తూ వచ్చింది. ఇక ఒత్తిడిని తట్టుకోలేక మనోవేదనకు గురైన ఆమని శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణ వార్త విన్న వెంటనే తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని బాబును వదిలి వెళ్లిపోయావా? అంటూ బోరున విలపించారు. వరకట్నం విషయంలో భర్త హరీష్, అతని సోదరుడు వెంకటేష్, కుటుంబసభ్యులు వేధించడంతో తన అక్క ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరుడు నవదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అమీన్ పూర్ పోలీసులు తెలిపారు.
Source link