Entertainment

ప్రేమికుల కోసం మరోసారి థియేటర్లలో ‘బేబీ’!


గత ఏడాది విడుదలైన చిన్న హీరోల సినిమాల్లో ‘బేబి’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్‌ దర్శకత్వంలో ఎస్‌కెఎన్‌ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది జూలై 14న విడుదలైంది. కల్ట్‌ బొమ్మగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇటీవలికాలంలో వస్తున్న సినిమాల్లోని భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో, ఊహకందని హీరో ఎలివేషన్స్‌తో విసిగి వేసారిన ప్రేక్షకులకు మంచి ఊరటనిచ్చిందీ సినిమా.  చక్కని ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాకి భారీ విజయాన్ని అందించారు ప్రేక్షకులు. 

ప్రేక్షకులకు మధురానుభూతిని కలిగించిన ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘బేబి’ చిత్రాన్ని  రీరిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పటికే వాలెంటైన్స్‌ డే సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ ‘తొలిప్రేమ’, సిద్ధార్థ్‌ ‘ఓయ్‌’, సూర్య సినిమా ‘సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్‌’, దుల్కర్‌ సల్మాన్‌ ‘సీతారామం’ చిత్రాలు రిలీజ్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమాల సరసన ‘బేబి’ కూడా చేరడం విశేషం. 



Source link

Related posts

బన్నీ, అట్లీ మూవీ.. రెమ్యూనరేషన్లకే రూ.300 కోట్లు!

Oknews

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే!

Oknews

Krishna Vamshi : నన్ను ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు!

Oknews

Leave a Comment