కూతురికి శ్రద్ధాంజలి ఫ్లెక్సీరాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla)జిల్లాకు చెందిన చిలువేరి అనూష బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె కొద్దిరోజులుగా యువకుడిని ప్రేమలో ఉంది. ఆ విషయం ఇంట్లో తెలిస్తే తమ పెళ్లికి ఒప్పుకోరనే భయంతో… ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. అనూష ఇంటికి తిరిగిరాకపోవడంతో అనూష తండ్రి మురళి… తెలిసిన వారికి, బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. అయితే అనూష ఆచూకీ లేదు. ఇంతలో అనూష తల్లిదండ్రులకు షాక్ ఇస్తూ…ప్రేమ పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తన కూతురు అనూష ప్రేమ పెళ్లి ఫొటో చూసి తండ్రి మురళి షాక్ కు గురయ్యారు. తన కూతురు అలాంటి పనిచేయదని, ఆమెను ట్రాప్ చేసి పెళ్లి (Love Marriage)చూసుకున్నాడని అనూష తండ్రి ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చేసిన పనికి తట్టుకోలేకపోయారు. తన కూతురు చనిపోయిందని, శ్రద్ధాంజలి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. శ్రద్ధాంజలి పోస్టర్ ను ఇంటి అరుగుకు అంటించి తన ఆవేదన చెప్పుకున్నారు. మీపై నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రులను మోసం చేయకండని వేడుకున్నారు. ఇన్నాళ్లు మీ కోసం బతికిన తల్లిదండ్రుల కోసం ఆలోచించాలని, ప్రేమ పెళ్లితో వదిలి వెళ్లిపోవద్దని సూచించారు. ప్రేమ పేరుతో తల్లిదండ్రుల గుండెలపై తన్నకండన్నారు. ఇన్నాళ్లు మీ కోసం తల్లిదండ్రులు చూపిందని ప్రేమ కాదా అని ఆ తండ్రి ప్రశ్నించారు.
Source link
previous post