దిశ, పీచర్స్ : బట్టల నుండి మనం వేసుకునే ఆర్నమెంట్ వరకు ప్రతి ఒక్కటి మన రూపాన్ని అందంగా మారుస్తాయి. ఒక్కో అకేషన్ లో ఒక్కో విధంగా ముస్తాబవుతూ ఉంటారు. శుభకార్యాల్లో, ఫంక్షన్లలో ట్రెడిషనల్ గా తయారవుతూ ఉంటారు. అలాగే బిజినెస్ మీటింగ్ లలో, ఆఫీస్ కి వెళ్ళినప్పుడు మాత్రం ప్రొఫెషనల్ లుక్ తో వెళ్లేందుకు చూస్తారు. ఇలా కనిపించేందుకు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. ఇంతకీ ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రొఫెషనల్ లుక్ లో స్టైలిష్ గా కనిపించాలంటే బ్లేజర్, ప్లెయిన్ షర్ట్, ప్యాంట్, స్కర్ట్, జీన్స్ ఇలా ఎన్నో రకాల బట్టలు వేసుకోవచ్చు. ఇందులో మీరు కంఫర్ట్ గా ఉండేట్టు చూసుకోవాలి. అలాగే బట్టల నాణ్యత కూడా చాలా అవసరం.
సందర్భానుసారంగా బట్టల రంగులను ఎంచుకోవాలి. ప్రొఫెషనల్ లుక్ కోసం, మీ వార్డ్‌రోబ్‌లో నలుపు, నేవీ, గ్రే, క్రీమ్, వైట్ కలర్ దుస్తులను చేర్చుకోండి. ఈ రంగులు ప్రొఫెషనల్ దుస్తులు చాలా క్లాస్ గా కనిపిస్తాయి.
మహిళలు అందంగా కనిపించేందుకు ఆభరణాలు పెద్ద పాత్ర పోషిస్తాయి. ఆఫీసుకు వెళ్లేటప్పుడు చిన్న, తక్కువ బరువున్న చెవిపోగులు ధరించాలి. అలాగే మీ చేతి వేళ్లకు చిన్న పెండెంట్‌లు ఉన్న ఉంగరాలు ధరించాలి. అలాగే సన్నని చైన్ వేసుకుంటే క్లాసీగా కనిపిస్తారు.
ఇక పాదరక్షల విషయానికొస్తే మహిళలు తమ దుస్తులకు సరిపోయే బెల్ట్ టైప్ హీల్స్ లేదా ప్లాట్‌లను ధరించవచ్చు. దాని రంగును జాగ్రత్తగా చూసుకోండి. నలుపు, క్రీమ్, తెలుపు లేదా నేవీ బ్లూ వంటి రంగులు పాదాలకు అందంగా కనిపిస్తాయి.
మేకప్, హెయిర్ స్టైల్ మనం అందంగా కనిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. మేకప్‌తో పాటు మంచి హెయిర్ స్టైల్‌ను అలవర్చుకోవాలి. అలాగే మీ గోళ్లను మెయింటెయిన్ చేయాలి.