Andhra Pradesh

ఫిర్యాదులు.. గొడవలు మొదలు


ఆంధ్ర ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అనుకోవడానికి లేదు. ఆ మాటకు వస్తే ఏ ఎన్నిక అయినా ఎక్కడో ఒక చోట గొడవలు తప్పవు. పైగా కొన్ని సెన్సిటివ్ పాకెట్లు వుంటాయి. అక్కడ ముందుగానే గట్టి బందోబస్త్ చేస్తారు. అయినా గొడవలు వుంటాయి. ఫలితంగా రీపోలింగ్ లు వుంటాయి. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని బట్టి వుంటాయి. ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా రాజకీయ పక్షాల హడావుడి వుంటుంది.

ఈసారి ఎన్నికకు కూడా ఇలాంటి వ్యవహారం ఉదయాన్నే మొదలైపోయింది. పెద్దిరెడ్డి ఇలాకా అయిన పుంగనూరు ప్రాంతంలో తమ పోలింగ్ ఏజెంట్లను వైకాపా నేతలు కిడ్నాప్ చేసారనే ఆరోపణ తో స్టార్ట్ అయింది. టీవీల్లో ఇదే మోత. అలాగే కొన్ని చోట్ల తేదేపా అనుకూల జనాలను కొట్టారనే ఫొటోలు సోషల్ మీడియాలో తిరగేస్తున్నాయి.

ఇవన్నీ ఉదయాన్నే స్టార్ట్ కావడం వెనుక పెద్ద స్కెచ్ నే వుందంటున్నాయి వైకాపా వర్గాలు. వైకాపా దౌర్జన్యం చేసేస్తోందనే ప్రచారం మొదలైతే ఓటు వేయని ప్రజల్లో తెలుగుదేశం పట్ల సింపతీ ఫ్యాక్టర్ స్టార్ట్ అవుతుంది ఆ విధంగా కూడా కొన్ని ఓట్లు అనుకూలంగా వచ్చే అవకాళం వుంది. అందుకోసంమే ఈ ప్రచారం తప్ప, మరేం లేదని ఆ వర్గాలు అంటున్నాయి.

ఫేక్ ప్రచారం అన్నది ఎన్నికల ప్రచారం అయిపోయినా ఆగడం లేదన్నమాట.



Source link

Related posts

ముదినేపల్లిలో దారుణం, తల్లితో స‌హ‌జీవ‌నం చేస్తూ, కూతురిపై అత్యాచారం, నిందితుడి అరెస్ట్-atrocity in mudinepally daughter raped while living with mother accused arrested ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Kurnool Cancer Institute : కర్నూలు క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ లో 97 ఖాళీలు, దరఖాస్తులకు రేపే లాస్ట్!

Oknews

నేటి నుంచి ఏపీలో టెట్‌ పరీక్షలు.. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ-tet exams in ap from today conducting exam in two sessions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment