అప్పుడు వైట్.. ఇప్పుడు బ్లూ..
ఫుట్‌బాల్ లో కార్డులంటే ఎల్లో, రెడ్ అనే అందరికీ తెలుసు. కానీ గతేడాది కొత్తగా వైట్ కార్డును ప్రవేశపెట్టారు. 1970 నుంచి ఫీల్డ్ లో ఉన్న ఎల్లో, రెడ్ కార్డులు కాకుండా ఈ వైట్ కార్డు చూపించడం ఇదే తొలిసారి. అయితే మిగతా కార్డుల్లాగా ఈ కార్డును ఓ ప్లేయర్ ను శిక్షించడానికి కాకుండా అభినందించడానికి వాడటం విశేషం. గతేడాది బెన్ఫికా, స్పోర్టింగ్ లిస్బన్ వుమెన్స్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ కార్డు చూపించారు.