Health Care

ఫెయిర్‌నెస్ క్రీముల‌వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు


దిశ, ఫీచర్స్ : గ్లామర్‌పై యువతలో రోజు రోజుకూ ఆసక్తి పెరుగుతోంది. తాము అందంగా కనిపించడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేస్తున్నారు. అందుకోసం మార్కెట్లో లభించే ఫెయిర్‌నెస్ క్రీములను చాలామంది వాడుతున్నారు. అయితే ఇది ప్రమాదకర పరిస్థితికి దారి తీయవచ్చునని ఒక అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. తరచుగా ఫెయిర్‌నెస్ క్రీములను వాడే వారిలో కిడ్నీ ప్రాబ్లమ్స్ సహా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నది.

వాస్తవానికి ఫెయిర్ నెస్ క్రీములు ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఆదరణ కలిగిన బ్యూటీ ప్రొడక్ట్స్‌గా ఉంటున్నాయి. వాటిని వాడటంవల్ల చర్మం లేదా ముఖ సౌందర్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతున్నారు. అయితే వీటి తయారీలో మెర్క్యురీ కంటెంట్ ఎక్కువగా ఉపయోగించడంవల్ల ఆరోగ్యంపై, ముఖ్యంగా మూత్ర పిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు అంటున్నారు. దీనివల్ల కిడ్నీల్లో ఫిల్టరింగ్ సిస్టం దెబ్బతిని ప్రోటీన్ లీకేజీకి కారణం అయ్యే మెంబ్రానస్ నెఫ్రోపతి కేసులు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

2021 నుంచి 2023 మధ్య కాలంలో ఫెయిర్‌నెస్ క్రీములు తరచూ వాడే 22 మందిపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. వీరిలో 68 శాతం, అంటే..15 మందికి ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 ప్రోటీన్ పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిన్నదని, కొందరు ప్రాణాంతక సమస్యతో పోరాడారని వెల్లడించారు. అంతేకాకుండా కొందరు వినియోగదారుల్లో మూత్ర పిండాల భాగంలో వాపు, అలాగే నురుగతో కూడిన మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపించాయి. ఫెయిర్‌నెస్ క్రీముల వాడకం ఆపేసిన తర్వాత కొందరిలో ఈ పరిస్థితి కాస్త చక్కబడినట్లు కూడా నిపుణులు నిర్ధారించారు. అందుకే ఫెయిర్‌నెస్ క్రీములు వాడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డెర్మటాలజిస్టులను, వైద్య నిపుణులను సంప్రదించి తమ చర్మానికి సరిపడే వాటిని ఉపయోగించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.



Source link

Related posts

ఇదేం ఫ్యాషన్ షో రా బాబు.. మోడల్స్‌పై చెత్త, కూల్ డ్రింక్స్ విసిరిన ప్రేక్షకులు.. వీడియో వైరల్

Oknews

రాస్బెరీలతో మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే..

Oknews

ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదా.. కారణాలు ఇవే కావచ్చు

Oknews

Leave a Comment