Latest NewsTelangana

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్


SIB Former DSP Praneet Rao Remand: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన SIB మాజీ DSP ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. కొంపల్లి జయభేరి లోని తన నివాసంలో నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ కన్యలాల్ ఎదుట ప్రణీత్ రావుని పంజాగుట్ట పోలీసులు ప్రవేశపెట్టారు. పంజాగుట్ట ACP మోహన్, తోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సుధాకర్, చందు, స్వాతి న్యాయమూర్తి ఇంటికి వెళ్లిన వారిలో ఉన్నారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి నిందితుడు ప్రణీత్ రావుకు రెండు వారాల డిమాండ్ విధించారు. న్యాయమూర్తి ఇంటి నుంచి ప్రణీత్ రావును  చంచల్ గూడా జైలుకు తరలించారు.

అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ 
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది. అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పోలీసులు ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

కీలక ఆధారాలు సేకరించి అరెస్ట్ చేసిన పోలీసులు 
ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక ఆధారాలను సేకరించిన అనంతరం చర్యలకు సిద్ధమైంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు పాత్రపై ఆధారాలను సేకరించిన తరువాతే అరెస్ట్‌ చేశామని పోలీసులు చెబుతున్నారు. మంగళవారం (మార్చి 12న) రాత్రి సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రాత్రికి రాత్రే ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఎస్‌ఐబీ లాగర్‌ రూమ్‌లో హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం చేసి, ఆ తరువాత నుంచి ప్రణీత్‌రావు పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్టు పోలీసులు చెబుతున్నారు. గడిచిన నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీసీఆర్‌బీలో రిపోర్ట్‌ చేసిన ఆయన.. అక్కడ జాయిన్‌ అయిన రెండు రోజులకే సిక్‌ లీవ్‌ పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ పై కీలక ఆధారాలు లభ్యం కావడంతో ఇటీవల ప్రణీత్ రావును డీఐజీ రవి గుప్త సస్పెండ్ చేయడం తెలిసిందే. సస్పెన్షన్‌కు వారం రోజులు ముందు నుంచే డీసీఆర్‌బీకి ప్రణీత్ రావు వెళ్లలేదని సమాచారం. సిరిసిల్ల హెడ్‌క్వార్టర్‌ విడిచి వెళ్లరాదని సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్టు తేలింది. 

అసలేం జరిగిందంటే..
ఎస్‌ఐబీలోని ఎస్‌వోటీ ఆపరేషన్‌ హెడ్‌గా ఉన్న సమయంలో డీఎస్పీ ప్రణీత్‌రావు రాజకీయ నాయకులు, ఎన్జీవోలు, పౌర హక్కుల నేతలతోపాటు మావోయిస్టులు, ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఫలితాల రోజు రాత్రి 9 గటల సమయంలో ఆయన లాగర్‌ రూమ్‌కు వెళ్లి హార్డ్‌ డిస్క్‌లతోపాటు డాక్యుమెంట్లను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఎస్‌వోటీ లాగర్‌ రూమ్‌ సీసీ కెమెరాలను ఆఫ్‌ చేయించారు. దాంతో ఆయన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఫోన్ల ట్యాప్‌ చేశారని ఆరోపణలకు పట్టు చిక్కినట్లయింది. లాగర్‌ రూమ్‌లో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేసి వెళ్లిపోయారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మార్చి 12న ఆయనను అరెస్ట్ చేశారు.

మరిన్ని చూడండి





Source link

Related posts

TS IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ బదిలీలు.. TSPSC కార్యదర్శిగా నవీన్‌ నికోలస్

Oknews

Megastar Chiranjeevi Angry on Mega Prince కొడుకేగా.. కోపమెందుకు చిరు..!

Oknews

కుటుంబ పార్టీలకు కుటుంబమే ఫస్ట్, మోదీకి నేషన్ ఫస్ట్- ప్రధాని మోదీ-sangareddy new news in telugu pm modi inaugurates 7000 crore project later attends bjp meeting ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment