Telangana

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం-త్వరలో మాజీ మంత్రులకు నోటీసులు, తెరపైకి మరో సీనియర్ అధికారి పేరు!-hyderabad phone tapping case police ready to give notice to ex ministers ,తెలంగాణ న్యూస్



Phone Tapping Case : తెలంగాణలో సంచలనమైన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) రోజుకో మలుపు తిరుగుతుంది. రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు, ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై నిఘా పెట్టారని, వాళ్ల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పనిచేసిన మరో సీనియర్‌ అధికారి దయాకర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1, ఎస్ఐబీ మాజీ చీఫ్ కు ఈ అధికారి సన్నిహితుడిగా తెలుస్తోంది. దయాకర్ రెడ్డి సుదీర్ఘకాలంగా ఎస్‌ఐబీలో(SIB) పనిచేశారు. ఈ కేసులో దయాకర్ రెడ్డి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయనతో పాటు ఓ ఇన్‌స్పెక్టర్‌ కు స్పెషల్ టీం నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు(Praneeth Rao), అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్టు చేశారు. వీరి విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్నాయని సమాచారం. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆయన పోలీసులు ఎదుట విచారణ హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.



Source link

Related posts

TS Inter Results 2024 Updates : ముగిసిన ‘స్పాట్ వాల్యూయేషన్’

Oknews

The online application process for the TS DSC 2024 will open from March 4 check details here

Oknews

Telangana CM Revanth Reddy comments on KCR and KTR for appointments

Oknews

Leave a Comment