ఛలో తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సక్సెస్ ని వైఫై లా తన చుట్టు తిప్పుకుంటున్న నటి రష్మిక. ఈ ముద్దుగుమ్మ ఖాతాలో గీత గోవిందం,పుష్ప,సరిలేరు నీకెవ్వరు, తమిళ వారిసు లాంటి భారీ హిట్స్ ఉన్నాయి.లేటెస్ట్ గా యానిమల్ తో తన హవాని ఇండియా వ్యాప్తంగా పరిచయం చేసింది. ఎక్స్ క్లూజివ్ గా రష్మిక కి సంబంధించిన ఒక న్యూస్ ఆమె రేంజ్ ని చెప్తుంది.
ప్రపంచంలోనే నెంబర్ వన్ మ్యాగజైన్ అయిన ఫోర్బ్స్ తమ బుక్ కవర్ పేజీ మీద రష్మిక ఫోటోని ఉంచింది.వివిధ రంగాల్లో 30 ఏళ్ళు లోపు అత్యంత ప్రతిభ కనబర్చిన వాళ్ళని గుర్తించిన ఫోర్బ్స్ తమ మ్యాగజైన్ మీద రష్మిక ఫోటోని ముద్రించడం ఇండియా వైడ్ గా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.యుఎస్ కి చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ 1913 లో ఏర్పడింది. అందులోని కవర్ పేజీ మీద తమ ఫోటో ఉండాలని సినీ, వ్యాపార రాజకీయ రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు కలలు కంటు ఉంటారు.కేవలం నేషనల్ లెవల్లో అత్యంత ప్రభావం చూపించే వాళ్ళ ఫోటోలని మాత్రమే ఫోర్బ్స్ తమ కవర్ పేజీ మీద ముద్రిస్తుంది. అలాంటి సంస్థ రష్మిక ఫోటోని ప్రచురించిందంటే ఆమె సాధించిన ఘనత ని అర్ధం చేసుకోవచ్చు. ఈ మేరకు ఈ విషయాన్నిఆమె సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అందరు ఆమెకి అభినందలు చెప్తున్నారు. ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ కూడా కంగ్రాట్స్ చెప్పిన వారిలో ఉన్నాడు.
ఇక రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప 2 లో నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నఆ మూవీలో తను మంచి ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తుంది. అలాగే తనే ప్రధాన పాత్రలో గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ కూడా చేస్తుంది.ఎలాంటి సినిమా చేసినా కూడా తన క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకోవడం రష్మిక స్పెషాలిటీ. అందుకే ఆమె ఫోర్బ్స్ దాకా వెళ్ళింది.దీంతో ప్రపంచదేశాలకు చెందిన ఫోర్బ్స్ లవర్స్ కి రష్మిక మరింతగా తెలియనుంది.