విజయ్ దేవరకొండ-పరశురామ్ కలయికలో కుటుంభ కథా చిత్రంగా తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. గీత గోవిందం కాంబినేషన్ రిపీట్ అంటే ఆ చిత్రంపై ఎంతగా అంచనాలు ఏర్పడాయి.. ఫ్యామిలీ స్టార్ పై అన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందులోను విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని ప్రమోట్ చేసినట్టుగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయకపోవడంతో.. అందరిలో ఈ చిత్రంపై ఆసక్తి మొదలైంది.
మంచి అంచనాల నడుమ విడుదలైన ఫ్యామిలీ స్టార్ ఓటీటీ పార్ట్నర్ అలాగే శాటిలైట్ పార్ట్నర్ ని ఫిక్స్ చేసుకున్నట్టుగా మేకర్స్ ఫ్యామిలి స్టార్ టైటిల్ కార్డ్స్ లోనే రివీల్ చేసారు. శాటిలైట్ పార్ట్నర్ గా స్టార్ మా ఉండగా.. ఈ చిత్ర ఓటీటీ హక్కులని ఫ్యాన్సీ ధరకు అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే టైటిల్ కార్డ్స్ లో అమెజాన్ ప్రైమ్ ని ఓటీటీ పార్ట్నర్ గా మేకర్స్ రివీల్ చేసారు.