ByGanesh
Tue 16th Apr 2024 08:20 PM
లైగర్ చిత్రంతో బాగా డిస్పాయింట్ అయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత చాలా కూల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే సినిమాలని ఎంచుకుంటున్నాడు. ఆ వరసలో ఆ తరహాలో వచ్చినవే ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు. ఈ రెండు చిత్రాలు సాలిడ్ గా కుటుంబ కథా చిత్రాలే. అలాగే విజయ్ దేవరకొండ లుక్స్ లో కూడా చాలా చేంజ్ కనిపించింది, లుక్స్ విషయంలో రౌడీ స్టార్ ని పొగిడిన వారే కానీ పొగడని వారు లేరు. కానీ ఆ సినిమాలకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
ఆ సినిమాల రిజల్ట్ ఎలా వున్నా విజయ్ దేవరకొండ లైగర్ మరకని కొద్దిగా తుడుచుకోగలిగాడు. అయితే సోషల్ మీడియాలో గనక విజయ్ దేవరకొండ మీద నెగిటివిటీ లేకపోతె ఈపాటికే విజయ్ దేవరకొండ పూర్తిగా లైగర్ డ్యామేజ్ నుంచి బయటపడేవాడు. ఫ్యామిలీ స్టార్ హిట్ అవుతుంది అని వీధీ – వాడా సినిమాని ప్రమోట్ చేసాడు.
ఎన్నడూ బుల్లితెర మీద కనిపించని విజయ్ ఆఖరికి బుల్లితెర పై కూడా కాలు పెట్టాడు. సందడి చేసాడు. ఏది వర్కౌట్ అవ్వలేదు. ఫ్యామిలీ స్టార్ కూడా విజయ్ ని డిస్పాయింట్ చేసింది. లైగర్ రిజల్ట్ విన్న విజయ్ తన తదుపరి చిత్రం కోసం వర్కౌట్స్ మొదలు పెట్టి సాయంత్రానికే దానిని మరిచిపోయాడంటూ ఆనంద్ దేవరకొండ ఒకొనొక సందర్భంలో చెప్పినట్టుగా ఇప్పడు విజయ్ అన్ని మర్చిపోయి గౌతమ్ తిన్ననూరి రో VD 12 కోసం ప్రిపేర్ అవుతున్నాడని తెలుస్తోంది.
Vijay Deverakonda in Family Star desperation:
Vijay Deverakonda back to work