Entertainment

బడ్జెట్‌ రూ.3 కోట్లు.. కలెక్షన్‌ రూ.113 కోట్లు. ఈ రికార్డును క్రాస్‌ చెయ్యడం సాధ్యమా?


ప్రస్తుతం సౌత్‌ సినిమాల్లో సంచలనం సృష్టిస్తున్న సినిమా ‘ప్రేమలు’. మలయాళంలో రూపొందిన ఈ సినిమా గత ఫిబ్రవరి 9న విడుదలైంది. మొదటిరోజు, మొదటి షో నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకొని కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. అదే నెలలో వాలెంటైన్‌ డే కూడా కలిసి రావడంతో సినిమాకి బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వచ్చింది. ఈనెల 9న తెలుగులో కూడా విడుదలై ఇక్కడ కూడా అదే ఊపును కొనసాగిస్తోంది. నస్లెన్‌ కె.గఫూర్‌, మమిత బైజు జంటగా నటించిన ఈ సినిమాకి గిరీశ్‌ ఎ.డి. దర్శకత్వం వహించాడు. నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ కూడా ఈ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరించాడు. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి అవలీలగా అడుగుపెట్టేసింది. ఇప్పటికే రూ.113 కోట్లకి పైగా కలెక్ట్‌ చేసింది. 

ఏ భాషలోనైనా హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకుల్ని ఊదరగొట్టేస్తున్న తరుణంలో టీనేజ్‌ కామెడీ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘ప్రేమలు’ చిత్రానికి ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇటీవలి కాలంలో ఇలాంటి లవ్‌స్టోరీ ఎక్కడా రాకపోవడంతో ప్రేక్షకులకు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. యూత్‌ని టార్గెట్‌ చేసి దర్శకుడు గిరీష్‌ రూపొందించిన ఈ సినిమా బాగా వర్కవుట్‌ అయింది. తెలుగులో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ప్రమోషన్‌ జరగలేదు. అయినా మౌత్‌టాక్‌తో రోజురోజుకీ కలెక్షన్స్‌ పెరుగుతూ ఇంకా థియేటర్లలో కొనసాగుతోంది. సినిమా రిలీజ్‌ అయిన 10 రోజుల తర్వాత కూడా హైదరాబాద్‌ సిటీలో ఇంకా 60 థియేటర్లలో ఈ సినిమా రన్‌ అవుతోందంటే సినిమాకి ఎంతటి ఆదరణ లభిస్తోందో అర్థం చేసుకోవచ్చు.  ఇప్పటికే ఈ సినిమా తెలుగులో రూ.10 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసి కలెక్షన్స్‌ స్టడీగా ఉన్నాయి. ఈమధ్యకాలంలో తెలుగులో డబ్‌ అయిన సినిమాల్లో ఈ స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం. 



Source link

Related posts

దుల్కర్‌ సల్మాన్‌ ఇప్పుడు ‘లక్కీ భాస్కర్‌’

Oknews

దేవర నటుడికి అరుదైన వ్యాధి.. అతనికి ఫుల్ హ్యాపీ 

Oknews

పుష్ప మాస్ జాతర షురూ.. ఇక పూనకాలే…

Oknews

Leave a Comment