బరువు తగ్గడానికి భలే ట్రిక్స్.. ఈ నాలుగు పనులు చెయ్యండి చాలు..!


posted on Dec 30, 2024 9:30AM

 

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి,  అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడానికి బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. అధిక బరువు మధుమేహం, గుండె జబ్బులు,  జీవక్రియకు సంబంధించిన అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి నిరంతరం కృషి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే బరువు తగ్గడం  అంత సులభం కాదని అనుకుంటారు.


బరువు తగ్గడానికి జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టించడం దగ్గర్నుంచి డైటింగ్, రకరకాల డైట్ ప్లాన్‌లు పాటించడం వరకు చాలా ఫాలో అవుతారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ  ప్రయోజనాలు లభించకపోతే బరువు తగ్గడానికి డైటింగ్ లేదా వ్యాయామం మాత్రమే పనికిరావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కోసం రోజువారీ దినచర్యలో కొన్ని ప్రత్యేక మార్పులు అవసరం. ముఖ్యంగా నాలుగు పనులు చేయడం ద్వారా బరువు తగ్గవచ్చట.  ఈ నాలుగు ఫాలో అయితే బరువు తగ్గడం ఇంత ఈజీనా అని మీరే ఆశ్చర్యపోతారు.

నిద్ర..

చాలామంది  బరువు తగ్గడానికి జిమ్ చేయడం, వ్యాయామాలు చేయడం, ఆహారం తక్కువ తీసుకోవడం వంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇలాంటివి  కొనసాగించడం సరికాదు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరానికి విశ్రాంతి,  తగినంత నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ప్రతి రాత్రి 7-9 గంటలు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.   మంచి రాత్రి నిద్ర బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.


విశ్రాంతి..

 వ్యాయామం చేయడం లేదా పరుగు వంటి మార్గాల  ద్వారా బరువు తగ్గుతారు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వ్యాయామం అవసరమే కానీ  దానితో పాటు కండరాలు తిరిగి రిపేర్ కావడానికి ,  అవి శక్తివంతంగా తయారవ్వడానికి  వారానికి 1-2 రోజులు విశ్రాంతి తీసుకోవాలి.  శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. సాధారణ వాకింగ్ లేదా యోగాతో పాటు పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి మంచి అవకాశం ఉంటుంది.

కేలరీలు..

ఫిట్‌గా ఉండటానికి సులభమైన సూత్రం  రోజువారీ తీసుకునే దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయడం. చాలా మంది వారాంతాల్లో ఆహారం విషయంలో తరచుగా  తమను తాము మోసం చేసుకుంటారు.  ఈ సమయంలో కేలరీలు తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చిప్స్‌కు బదులుగా ఇంట్లో తయారుచేసిన పాప్‌కార్న్.. డెజర్ట్‌కు బదులుగా డార్క్ చాక్లెట్..  చక్కెర పానీయాలకు బదులుగా పండ్ల రసాలను ప్రయత్నించండి. ప్రోటీన్-రిచ్ అల్పాహారం కోసం, కాల్చిన మఖానా లేదా పనీర్ తినాలి. బరువు తగ్గడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

స్ట్రెస్..

ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వ్యక్తులు  బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం రోజువారీ వాకింగ్ చేయాలి.  లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలి.  ఆహారంలో గ్రీన్ టీ, బచ్చలికూర, వాల్‌నట్స్,  గుమ్మడి గింజలు వంటి ఒత్తిడిని తగ్గించే ఆహారాలను చేర్చుకోవాలి.  ఒత్తిడిని తగ్గించడానికి, కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి.   మనస్సును ప్రశాంతపరిచే విషయాలపై దృష్టి పెట్టాలి.


                                        *రూపశ్రీ.



Source link

Leave a Comment