posted on Jun 19, 2024 9:30AM
ఫిట్‌నెస్ గురించి మాట్లాడే చాలామంది బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్న వారై ఉంటారు. వీరు బరువు తగ్గడం, తీసుకునే ఆహారం గురించి తరచుగా చర్చిస్తూ ఉంటారు. కొందరు పొట్ట తగ్గడానికి, మరికొందరు బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చాలా అరుదుగా శరీరంలో కొవ్వు తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఇలా బరువు తగ్గడం, శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం వేర్వేరు విషయాలని. శరీరంలో కొవ్వు తగ్గడం వల్ల శరీరం ఫిట్ గా మారుతుంది. కానీ బరువు తగ్గడం అనేది శరీరంలో కండరాలకు అస్సలు మంచిది కాదు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకుంటే..
కొవ్వు తగ్గడం అంటే శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వును తగ్గించడం. కొవ్వు కండరాల చుట్టూ పొర రూపంలో పేరుకుపోతుంది. దానిని తగ్గించడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. కానీ కండరాల నష్టం అంటే కండరాలు తగ్గుతాయి. మన శరీర బలం, స్థిరత్వం కాపాడుకోవడంలో కండరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే కండరాలకు నష్టం కలిగితే అది ఆరోగ్యానికి మంచిది కాదు.
బరువు తగ్గడం అంటే కొవ్వు తగ్గడం. కొవ్వును తగ్గించడానికి కేలరీల తీసుకోవడం తగ్గించాలి. శరీరంలో కొవ్వును కోల్పోతే కండరాలు అవసరమైన కేలరీలను పొందలేకపోవచ్చు. కొవ్వు తగ్గడం, కండరాలు పెరగడం ఒకేసారి జరుగుతుందా అనే సందేహం ప్రజల్లో ఉంటుంది.
బరువు తగ్గడం కోసం క్యాలరీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే శరీరంలో క్యాలరీల లోటు ఏర్పడి శరీరానికి అవసరమైన శక్తి అందనప్పుడు, కండరాలను పనితీరు పెరిగి శరీరానికి శక్తి లభిస్తుంది. దీని కారణంగా కండరాల నష్టం ఏర్పడుతుంది.
కండరాల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు తీసుకుంటూ శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల కండరాలు బలంగా ఉంటూనే శరీరంలో ఉన్న అదనపు కొవ్వు తగ్గి బరువు తగ్గడం జరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలా? లేదా శరీరంలో కొవ్వు తగ్గించుకోవాలా? అనే విషయాన్ని శరీర స్థితిని బట్టి నిర్ణయించుకోవాలి.
*రూపశ్రీ.