Health Care

బరువు తగ్గేందుకు రాత్రిపూట డిన్నర్ మానేస్తున్నారా.. ప్రమాదంలో పడినట్టే


దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ స్టైల్ లేదా ఇతర సమస్యల వల్ల బరువు పెరగడం లేదా ఊబకాయం బారిన ఎక్కువగా పడుతున్నారు. అధిక బరువు పెరగడం వల్ల మన శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది. ఊబకాయం కారణంగా మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్ వంటి అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది ఊబకాయాన్ని సాధారణ సమస్యగా భావిస్తారు. మరికొంతమంది మాత్రం ఈ సమస్య నుంచి బయటపడేందుకు చూస్తుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని ప్రయత్నాలతో బరువు తగ్గినా భవిష్యత్తులో వారికి సమస్యగా మారుతుంది. అలాంటి ప్రయత్నాల్లో రాత్రి పూట భోజనం చేయకపోవడం కూడా ఒకటి. బరువు తగ్గాలనుకునే వారు రాత్రి భోజనం మానేస్తారు. దీని కారణంగా శరీరంలో పోషకాల లోపం ఉంటుంది. రాత్రిపూట భోజనం మానేయడం వలన అనేక సమస్యలు ఎదురవుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రజలు రాత్రిపూట ఆహారం తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిదని భావించినా దాని వల్ల అనేక నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు డైటీషియన్లు. అధిక బరువుతో బాధపడుతున్నవారు కొన్ని నెలల పాటు రాత్రి భోజనం చేయకుండా ఉంటే చాలని, సంవత్సరాల తరబడి దీనిని అనుసరించాల్సిన అవసరం లేదంటున్నారు. ఎక్కువ కాలం రాత్రిపూట ఆహారం మానేయడం వల్ల శరీరంలో పోషకాల లోపం కూడా ఏర్పడుతుంది.

కొంత మంది మధ్యాహ్న భోజనంలో భారీగా తింటుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ల సంఖ్య పెరుగుతుంది. అలా కాకుండా కొంచం కొంచంగా ఎక్కువ సార్లు తింటే క్యాలరీల కౌంట్‌ను బ్యాలెన్స్ చేయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా కేలరీలు తీసుకోవడం తగ్గించి ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని నిత్యం తీసుకోవాలని చెబుతున్నారు.

రాత్రిపూట ఆహారం తీసుకోకపోవడం వల్ల కలిగే నష్టాలు..

కొందరు బరువు తగ్గాలని అందుకోసం డిన్నర్ మానేయాలని నిర్ణయించుకుంటారు. కానీ వారు దానిని సరిగ్గా పాటించలేరు. ఇలా చేయడం ద్వారా కొన్నిసార్లు రాత్రిపూట ఆకలిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ప్రజలు ఇంట్లో ఉన్న ఆహారపదార్థాలను తింటారు. దీనివల్ల లాభానికి బదులు నష్టమే కలుగుతుంది. మీకు బాగా ఆకలిగా అనిపిస్తే బ్యాలెన్స్‌డ్ డైట్ పాటించాలని డైటీషియన్ లు చెబుతున్నారు. అలాగే వీలైనంత ఎక్కువ నీరు తాగాలని చెబుతున్నారు. ఎందుకంటే ఈ అలవాటు మనల్ని అతిగా తినకుండా కాపాడుతుంది.

రాత్రి భోజనంలో ఏం తినాలి..

రాత్రి భోజనం మానేయాలని నిర్ణయించుకున్నట్టయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. పడుకునే ముందు కొంచెం నీరు తాగాలి. అయినప్పటికీ ఆకలిని తట్టుకోలేకపోతే లైట్ ఫుడ్ తినడం ద్వారా ఆకలిని తీర్చుకోవచ్చు. ఒక వేళ భోజనమే చేయాలనుకుంటే రాత్రి 7 గంటలకే పూర్తి చేయాలని చెబుతున్నారు. లేదా రాత్రిపూట మీ డిన్నర్ లో పప్పు, 2 చపాతీలు, కూరగాయలు, సలాడ్‌ని తినడం మర్చిపోవద్దని చెబుతున్నారు. తిన్న తర్వాత కొన్ని నిమిషాలు నడవడం కూడా బరువు తగ్గడంలో సహాయకరంగా ఉంటుందట.



Source link

Related posts

డీ హైడ్రేషన్‌ నుంచి తప్పించుకోవాలంటే రోజుకు ఎన్ని లీటర్ల వాటర్ తాగాలో తెలుసా..?

Oknews

ఆ విషయంలో వెంటాడుతున్న అభద్రత.. రోజుకు 5 సార్లు..

Oknews

ఆ పనికోసం కంప్యూటర్ల ముందు గడిపితే అంతే సంగతులు.. పురుషుల్లో అంగ స్తంభన సమస్యలు తలెత్తుతాయట !

Oknews

Leave a Comment