Top Stories

బాబుకు జైలే కరెక్ట్…!


టీడీపీ అధినేత చంద్రబాబుకు జైలు కరెక్ట్ అని డేరింగ్ అండ్ డేషింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ కేఏ పాల్. బాబు దేశంలోనే అత్యంత అవినీతిపరుడు అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బాబు ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని లెక్క వేసి మరీ పాల్ చెప్పారు.

బాబు అవినీతిలో ఆయన కుమారుడు లోకేష్ తో పాటు అచ్చెన్నాయుడుకు కూడా భాగం ఉందని కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ జైలు మీద ఆందోళనలు చేసేవారు అంతా పెయిడ్ ఆర్టిస్టులే అని ఆయన ఫైర్ అయ్యారు.

బాబు అవినీతి మీద నిలదీయాల్సిన వారు మద్దతు ఇస్తున్నారు అని జనసేన మీద ఆయన మండిపడ్డారు. కేవలం పాతిక సీట్ల కోసం జనసేనను పవన్ తాకట్టు పెట్టారని హాట్ కామెంట్స్ చేశారు. ప్యాకేజ్ కోసం కాపులను తాకట్టు పెడుతున్నారని కేఏ పాల్ భారీ ఆరోపణ చేశారు.

ఇప్పటిదాకా చూసుకుంటే కేఏ పాల్ మాదిరిగా చంద్రబాబు అరెస్ట్ ని జైలు జీవితాన్ని ఏకి పారేసిన నేత వైసీపీ తప్ప మరొకరు లేరు. అందరూ సన్నాయి నొక్కులు నొక్కేవారే ఉన్నారని అంటున్నారు. కేఏ పాల్ మాత్రం బాబు అవినీతి మీద లెక్కలు కట్టి మరీ ఆయనకు జైలు జీవితం సరైన శిక్ష అని తనదైన తీర్పు ఇచ్చేశారు. టీడీపీని జనసేనను కలిపి దంచడంలో పాల్ ఆరితేరిపోయారు. ఆయన సెటైర్లకు, కౌంటర్లకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా ఉన్నారు అంటే కేఏ పాల్ కి పాలిటిక్స్ తెలియదనుకోగలరా.



Source link

Related posts

నేనూ శబ్దం చేస్తా… చంద్రబాబుకు మద్దతుగా!

Oknews

'ఊ.. అంటావా' సాంగ్ వెనక గమ్మత్తైన విషయం

Oknews

జ‌గ‌న్‌కు బైబై స‌రే… ముందు గెలిచేది చూసుకో!

Oknews

Leave a Comment