Top Stories

బాబు అవినీతి సొమ్ము.. లాయ‌ర్ల ఖ‌ర్చుకు కూడా!


"అవ్వ తీసిన గంధం తాత బుడ్డకు సరి " అన్నది పాత కాలపు ఒక ముతక సామెత. స్కిల్ స్కామ్ కేసులో నొక్కేసిన సొమ్ము సుప్రీంకోర్టు లాయ‌ర్ల‌కు స‌రిపోయేలా వుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. సుప్రీంకోర్టు ప్ర‌ముఖ లాయ‌ర్లు హ‌రీశ్ సాల్వే, లూథ్రా త‌దిత‌రుల‌కు స్కిల్ స్కామ్‌లో వాదించ‌డానికి కోట్లాది రూపాయ‌ల‌ను టీడీపీ చెల్లిస్తోంది. రోజుకు ఒక్కో లాయ‌ర్‌కు కోటి రూపాయ‌ల‌కు పైగా లాయ‌ర్ ఫీజు కింద చెల్లిస్తున్న‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

ఈ లెక్క‌న గ‌త నెల 9న నంద్యాల‌లో చంద్ర‌బాబును స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ చేసిన మొద‌లు, ఇప్ప‌టి వ‌ర‌కూ ఏసీబీ కోర్టు మొద‌లుకుని హైకోర్టు, సుప్రీంకోర్టుల‌లో ఎన్ని ద‌ఫాలు వాద‌న‌లు జ‌రిగాయో మ‌నంద‌రికీ తెలిసిందే. స్కిల్ స్కామ్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో చంద్ర‌బాబు క్వాష్ పిటిష‌న్ వేసుకున్న సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు త‌ర‌పున ఒక రోజు ఏకంగా ముగ్గురు న‌లుగురు పెద్ద లాయ‌ర్లు వాదించ‌డం చూసి న్యాయ‌మూర్తులే ఆశ్చ‌ర్య‌పోయారు.

స్కిల్ స్కామ్‌లో టీడీపీ అకౌంట్‌కు చేరిన లెక్క రూ.30 కోట్లు లోపు. రూ.300 కోట్ల‌కు పైగా  ఏపీ ప్ర‌భుత్వం చెల్లించిన‌ప్ప‌టికీ, అందులో అధికారికంగా అవినీతి జ‌రిగిన సొమ్ము మాత్రం సీఐడీ లెక్క ప్ర‌కారం వేరే వుంది. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు కేసు వాదించ‌డానికి, ఆయ‌న అవినీతికి పాల్ప‌డ్డార‌ని చెబుతున్న మొత్తం స‌రిపోవ‌డం లేదు. ఇంకా చేతి నుంచి టీడీపీ పెట్టుకోవాల్సి వ‌స్తోంది.

వెయ్యి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివాన‌కు ఏదో అయిన చందంగా…స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబు ప‌ట్టుబ‌డ్డారు. తాను నిప్పు అంటూ ఇంత కాలం చంద్ర‌బాబు తెగ ఫోజులు కొట్టారు. ఇప్పుడు అవినీతి కేసులో జైలుకెళ్ల‌డంతో ఇక‌పై నిప్పు, ఉప్పు, ప‌ప్పు అంటూ క‌థ‌లు చెప్ప‌డానికి వుండ‌దు. లాయ‌ర్ల‌కు కోట్లాది రూపాయ‌లు చెల్లిస్తున్నా, న్యాయ‌స్థానాల్లో మాత్రం ఫలితం దక్కడం లేదు. ఇదే టీడీపీకి ఆవేద‌న క‌లిగించే విష‌యం.



Source link

Related posts

సింపుల్ గా అర్జున్ కూతురు నిశ్చితార్థం

Oknews

ఆత్మహత్యలకు కేటీఆర్ హింట్ ఇస్తున్నారా?

Oknews

ఉత్తరాంధ్రాలో కాంగ్రెస్‌కి బోణీ నిల్?

Oknews

Leave a Comment