Top Stories

బాబు స‌భ జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు.. వాళ్ల‌తో డ్యాన్స్‌!


సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు అనుకూల‌, వ్య‌తిరేక వార్ భీక‌రంగా జ‌రుగుతోంది. బాబును దైవాంశ సంభూతుడ‌న్న‌ట్టు టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చిత్రీక‌రిస్తుండ‌డం, అదే రేంజ్‌లో ఆయ‌న్ను సెటైర్స్‌తో చిత‌క్కొడుతున్నారు. స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ అయ్యాడ‌నే విష‌యాన్ని ప‌చ్చ బ్యాచ్ అస‌లు జీర్ణించుకోవ‌డం లేదు. అరెస్టే అక్ర‌మ‌మంటూ ఆ పార్టీ నాయ‌కులు ద‌బాయిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న చంద్ర‌బాబుకు సంఘీభావంగా ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌డం, టికెట్ల ఆశావ‌హులు ఎక్కువ‌గా వుండ‌డంతో టీడీపీ అధిష్టానం దృష్టిని ఆక‌ర్షించేందుకు కొంద‌రు నేత‌లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి స్టేడియంలో ఆదివారం సాయంత్రం 4 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు గ్రాటిట్యూడ్ క‌న్స‌ర్ట్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ త‌ల‌పెట్టారు.

ఈ కృత‌జ్ఞ‌త స‌భ‌ను ల‌క్ష మందితో నిర్వ‌హిస్తామంటూ నిర్వాహ‌కులు హైప్ క్రియేట్ చేయ‌డం విశేషం. నిర్వాహ‌కుల అతి ఇట్లా వుంటే, వారికి కౌంట‌ర్‌గా నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో సెటైర్స్ విసురుతున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తొడ‌లు కొట్టే, మీసాలు తిప్పే అంద‌మైన తెలుగు మ‌హిళా నాయ‌కురాళ్ల‌తో ప్ర‌త్యేక డ్యాన్స్ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్టు, వారి ఫొటోల‌తో పోస్టులు పెట్ట‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

క‌నీసం ఈ మ‌హిళా నాయ‌కురాళ్ల ఆట‌పాట‌లు, అంద‌చందాల‌ను ఆస్వాదించేందుకైనా ల‌క్ష మంది జ‌నం రాక‌పోతారా? అని టీడీపీ ఆశాభావంతో ఉన్న‌ట్టు నెటిజ‌న్లు ఉతికి ఆరేస్తున్నారు. నాలుగు గంట‌ల నుంచి 6 వ‌ర‌కు వీరి ప్ర‌త్యేక ఆట‌పాట‌ల కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తార‌ని, ముందొచ్చిన వారికే సీట్లు రిజ‌ర్వ్ చేస్తార‌ని నెటిజ‌న్లు నోట్ కూడా పెట్ట‌డం గ‌మ‌నార్హం. ముల్లును ముల్లుతోనే తీయాల‌నే ఉద్దేశంతో టీడీపీ విప‌రీత ధోర‌ణుల‌కు ఇట్లే స‌మాధానం చెప్పాల‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీళ్లిద్ద‌రి అతి చూస్తున్న త‌ట‌స్థ నెటిజ‌న్లు… ఓర్నీ అతి త‌గ‌లెయ్యా అని నిట్టూర్చుతున్నారు.



Source link

Related posts

రాంగ్ రూట్‌లో జ‌గ‌న్!

Oknews

కార్యకర్తలకు చిరాకు పుట్టిస్తున్న పవన్ కల్యాణ్!

Oknews

సెన్సార్ సర్టిఫికేట్ కోసం లంచం ఇచ్చిన హీరో

Oknews

Leave a Comment