Top Stories

బాబు హెల్త్ రిపోర్ట్‌పై వివాదం!


రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న చంద్ర‌బాబు కేంద్రంగా రాజ‌కీయ వివాదం సృష్టించాల‌ని టీడీపీ నిత్యం ఏదో ఒక ప్ర‌య‌త్నం చేస్తోంది. చంద్ర‌బాబుకు జైల్లో స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేదని, వేడి నీళ్లు ఇవ్వ‌లేద‌ని, దోమ‌ల‌తో దాడి చేయిస్తున్నార‌ని, ఏసీ సౌక‌ర్యం లేద‌ని ఇలా ఏదో ఒక‌టి విమ‌ర్శిస్తూనే ఉన్నారు. 

చంద్ర‌బాబుకు స్టెరాయిడ్స్ ఎక్కించి ప్రాణాలు తీయాల‌ని కుట్ర ప‌న్నుతున్నార‌ని లోకేశ్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. మ‌రోవైపు త‌న భ‌ర్త ఐదు కిలోలు త‌గ్గార‌ని, ఇదే రీతిలో ఆయ‌న ఆరోగ్యం బ‌రువు త‌గ్గితే ఆ ప్ర‌భావం కిడ్నీల‌పై ప‌డుతుంద‌ని భువ‌నేశ్వ‌రి కూడా ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఏసీబీ కోర్టును ఆశ్ర‌యించి ఎట్ట‌కేల‌కు ఏసీ సౌక‌ర్యాన్ని బాబుకు స‌మ‌కూర్చుకోగ‌లిగారు. చంద్ర‌బాబు ఆరోగ్యానికి సంబంధించి జైలు అధికారులు నివేదిక‌ను ఎప్ప‌టిక‌ప్పుడు న్యాయ‌స్థానానికి స‌మ‌ర్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు త‌ర‌పు న్యాయ‌వాదులు చంద్ర‌బాబు హెల్త్ రిపోర్ట్‌ను ఇవ్వాల‌ని రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు అధికారుల‌ను అడిగారు. రిపోర్ట్ ఇచ్చేందుకు జైలు అధికారులు నిరాక‌రించారు.

బాబు హెల్త్ రిపోర్ట్‌ను కోర్టుకు స‌మ‌ర్పించామ‌ని, అక్క‌డి నుంచి తీసుకోవాల‌ని లాయ‌ర్ల‌కు జైలు అధికారులు తేల్చి చెప్పారు. దీన్ని కూడా టీడీపీ నేత‌లు వివాదం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. బాబు హెల్త్ రిపోర్ట్‌ను అడిగినా జైలు అధికారులు ఇవ్వ‌లేద‌ని, ఏదో దాస్తున్నారంటూ టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టారు. టీడీపీ నేత‌ల బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని, చ‌ట్ట‌ప్ర‌కారం ఏమి చేయాలో అదే చేస్తామ‌ని జైలు అధికారులు స్ప‌ష్టం చేశారు. 



Source link

Related posts

ష‌ర్మిలా.. నీకు ఏం అన్యాయం జ‌రిగిందో చెప్పుః స‌జ్జ‌ల‌

Oknews

విశాఖలో అడుగు కదలని కూటమి…!

Oknews

ష‌ర్మిల‌ను చూస్తే ఆ ఎంపీకి జాలేస్తోంద‌ట‌!

Oknews

Leave a Comment