EntertainmentLatest News

బాలకృష్ణ ని బెల్లంకొండ శ్రీనివాస్ మరిపిస్తాడా!


అల్లుడు శ్రీనుతో  తెలుగు ప్రేక్షకుల హృదయాన్ని  గెలుచుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్(bellamkonda sreenivas)ఆ తర్వాత స్పీడున్నోడు,  జయ జానకి నాయిక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాలు చేసాడు. హిందీలో కూడా ఛత్రపతి అనే మూవీ చేసాడు. తాజాగా తన కొత్త మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  

 బెల్లంకొండ  ప్రెజంట్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో  టైస‌న్ నాయుడు అనే మూవీ చేస్తున్నాడు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నఈ మూవీ  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక  రీసెంట్ గా వన్ వీక్ క్రితం ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాగా  కౌశిక్ దర్శకుడు. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో బెల్లంకొండ  అఘోర గా కనపడబోతున్నాడని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే తెలుగు సినిమా లో మరో సరికొత్త సంచలనానికి నాంది పడినట్టే. అఖండ(akhanda)లో అఘోర గా బాలయ్య(balakrishna)సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. 

 

ఇక హైంధ‌వ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు అనే సమాచారం వస్తుంది. చందు మ‌హేష్, సాయి శ‌శాంక్ లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయనున్నారని, లుధీర్ అనే కొత్త దర్శకుడు ఈ మూవీ ద్వారా పరిచయం కాబోతున్నాడని అంటున్నారు. ఇక ఈ మూవీతో బెల్లంకొండ తన సినీ కెరీర్ లో వేగం పెంచబోతున్నాడని  తెలుస్తుంది. అదే విధంగా ఈ సారి ఎలాగైనా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటాలనే  పట్టుదలతో ఉన్నాడు. అందుకే చాలెంజింగ్ పాత్రలని ఎంచుకుంటున్నాడు. 

 



Source link

Related posts

Balayya Fans vs Jr NTR Fans ఎన్టీఆర్ ఫాన్స్ vs బాలయ్య ఫాన్స్

Oknews

రేషన్ కార్డు సినిమా అని తక్కువ అంచనా వెయ్యకండి..మణిశర్మ ఉన్నాడు

Oknews

Rashmika says Vijay will support her విజయ్ సపోర్ట్ చేస్తాడంటున్న రష్మిక

Oknews

Leave a Comment