మాస్.. ఊర మాస్.. ఈ పదాలు వినటమే గాని నిత్యం ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని పొందలేకపోతున్నారు. అలాంటి వాళ్ళందరి మనోవేదనని పరిగణలోకి తీసుకొనే హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ(balakrishna)సుమారు మూడున్నర దశాబ్దాల పై నుంచే తన సినిమాల ద్వారా మాస్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు నూట ఎనిమిది సినిమాలు చేసాడు. అందులో తొంబై శాతం మాస్ మూవీస్ నే. ఇప్పుడు నూట తొమ్మిదవ సినిమా ప్రిపేరింగ్ పనుల్లో ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించి అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నారు.
బాలకృష్ణ 109 వ సినిమాకి గత కొన్ని రోజులుగా వీర మాస్ అనే టైటిల్ ఫిక్స్ చెయ్యబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ ఏముందిలే మాములు సినిమాల విషయంలోనే ఇలాంటి ప్రచారాలు వస్తు ఉంటాయి. అలాంటిది బాలయ్య సినిమా విషయంలో పుకారులు రావా ఏంటని ఫ్యాన్స్ లైట్ గా తీసుకున్నారు. కానీ ఆ పుకారు వాస్తవ రూపం దాల్చుతుందేమో అనే దిగులు ఫ్యాన్స్ ని ఆవహించింది. దీంతో ఇప్పుడు రంగంలోకి దిగి సోషల్ మీడియాని తమ మెసేజెస్ తో ఒక ఊపు ఉపుతున్నారు. దయ చేసి మా బాలయ్య సినిమాకి వీర మాస్ టైటిల్ ఫిక్స్ చెయ్యవద్దు. వేరే టైటిల్ ని ఆలోచించమని అంటున్నారు. ఏకంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ కే మెసేజ్ లు చేస్తు ఎందుకు ఫిక్స్ చెయ్యకూడదో కూడా చెప్తున్నారు.
వీర మాస్ టైటిల్ అనేది రెగ్యులర్ సినిమాలకి ఫిక్స్ చేసే టైటిల్ లా ఉంటుందని, పైగా కొంచం ఎబ్బెట్టుగా కూడా ఉందని అంటున్నారు. అసలు బాలయ్య రేంజ్ లో టైటిల్ లేదని, పర్సన్ పేర్లతో వచ్చే టైటిల్ అయితే పవర్ ఫుల్ గా ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే మేకర్స్ వీర మాస్ టైటిల్ ఫిక్స్ చెయ్యాలని అనుకుంటే మాత్రం ఫ్యాన్స్ సలహాలని గౌరవించి టైటిల్ మార్చే అవకాశం నూటికి నూరుపాళ్లు ఉంది.ఎందుకంటే అక్కడ ఉంది బుల్ జోడర్స్ కి సైతం ఎదురెళ్ళే బాలయ్య ఫ్యాన్స్. ఇక బాలయ్య వరుస హిట్ ల తో మంచి జోరు మీద ఉండటంతో 109 మీద అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి(chiranjeevi)వాల్తేరు వీరయ్య తో హిట్ అందుకున్న బాబీ(bobby)దర్శకుడు.