బాలయ్య అయిదు దశాబ్ది ఉత్సవాలు Great Andhra


నందమూరి బాలకృష్ణ అయిదు దశాబ్దాల సినిమా జీవిత ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా జ‌రుగుతున్నాయి. అయిదు దశాబ్దాల నట జీవితం పూర్తి చేసుకున్న వారు చాలా అరుదుగా వుంటారు. అందుకే బాలయ్య అయిదు దశాబ్దాల ఉత్సవాలను చాలా భారీగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు.

కూకట్ పల్లి లోని ఖైతలాపూర్ గ్రవుండ్స్ లో ఈ ఫంక్షన్ ను సెప్టెంబర్ 1 న నిర్విహించబోతున్నారు. ఇందుకోసం అన్ని భాషల సినిమా సెలబ్రిటీలను రప్పించే కార్యక్రమం మొదలయింది. అందరికీ ముందుగా సమాచారం అందించారు

ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. బాలయ్య మరోసారి మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. బాలయ్య ఓ అల్లుడు మంత్రి, మరో అల్లుడు ఎంపీ. బావ చంద్రబాబు సిఎమ్. టాలీవుడ్ లో తెలుగుదేశం మద్దతు దారులు ఎక్కువ. మరి అలాంటిది బాలయ్య 50 ఏళ్ల సంబరాలు ఏ లెక్కలో వుంటాయి. అందుకే అదే రేంజ్‌లో సంబరాల ప్లానింగ్ జ‌రుగుతోంది.

దాదాపు ప్రతి హీరోను రప్పించాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అన్ని భాషల ప్రముఖులు వస్తారనే మాట ఇచ్చారు. తెలుగు హీరోల సంగతి ఏమిటి అన్నది త్వరలో క్లారిటీ వస్తుంది. చంద్రబాబు, పవన్ కనుక ముఖ్య అతిధులుగా వస్తే, టోటల్ టాలీవుడ్ అక్కడే వుంటుంది.



Source link

Leave a Comment