Entertainment

బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ను పెళ్లాడిన టాలీవుడ్‌ హీరోయిన్‌!


టాలీవుడ్‌లో అరడజనుకు పైగా సినిమాల్లో నటించిన బ్యూటీ అక్ష పార్థసాని తన ప్రియుడు కౌశల్‌ షాతో కలిసి ఏడడుగులు నడిచింది. గత ఏడాది వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. సోమవారం గోవాలో వీరు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్నారు. ఇప్పుడు కౌశల్‌, అక్షల పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌లో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న కౌశల్‌, అక్ష గత కొన్నేళ్ళుగా లవ్‌లో ఉన్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. గోవాలో ఎంతో వైభవంగా వీరి పెళ్లి జరిగింది. కౌశల్‌ సినిమాటోగ్రాఫర్‌ కావడంతో వెరైటీగా కెమెరా క్రేన్‌పై పెళ్లి మంటపానికి వచ్చాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. 

తమ పెళ్లి ఫొటోలను షేర్‌ చేస్తూ ‘మా ప్రార్థనలు ఫలించాయి. మేమిద్దరం ఇప్పుడు ఒక్కటయ్యాం. దేవుడి దయ, ఇరు కుటుంబాల ఆశీర్వాదాలు మాకెప్పుడూ ఉంటాయి’ అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది అక్ష. ఈ పెళ్లి విషయం తెలుసుకున్న కొందరు సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

నిఖిల్‌ హీరోగా నటించిన ‘యువత’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అక్ష పార్థసాని ఆ తర్వాత రైడ్‌, అదినువ్వే, కందిరీగ, డా.సలీమ్‌, డిక్టేటర్‌ వంటి సినిమాల్లో కనిపించి అలరించింది. 2017లో వచ్చిన ‘లవ్‌ యు ఫ్యామిలీ’ అనే హిందీ చిత్రంలో హీరోయిన్‌ నటించిన అక్ష ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. 2004లో వచ్చిన ‘ముసాఫిర్‌’ చిత్రంతో బాలనటిగా తెరంగేట్రం చేసిన అక్ష.. తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళ భాషల్లో దాదాపు 20 సినిమాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు చదువుకునే రోజుల్లోనే 75కి పైగా కమర్షియల్‌ యాడ్స్‌లో నటించి మోడల్‌గా మంచి పేరు తెచ్చుకుంది. 



Source link

Related posts

యంగ్ హీరోయిన్ కిడ్నాప్ సంచలనం.. కేసులో ఊహించని మలుపు!!

Oknews

సంక్రాంతి సమరం.. చిరంజీవికి పోటీగా రవితేజ, వెంకటేష్…

Oknews

ఖచ్చితంగా సంతోషపెడతాను అంటున్న తెలుగు హీరోయిన్

Oknews

Leave a Comment