దిశ, ఫీచర్స్ : భారతీయుల ఎన్నో ఏండ్ల కల నెరవేరింది. రామజన్మభూమిలో రాం లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అయితే ఈ కార్యక్రమం కోసం ముగ్గురు శిల్పులు మూడు విగ్రహాలను చెక్కారు. ఈ మూడు విగ్రహాల్లో కర్ణాటకలోని మైసూర్ కు చెందిన యోగిరాజ్ చెక్కిన రామచంద్రుని విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట కోసం ఎంపిక చేశారు. మరి మిగిలిన రెండు విగ్రహాలను ఆలయ ట్రస్టీలు ఏం చేశారు. వాటిని ఎక్కడ ప్రతిష్టించారు అన్న విశయాలు ఎవరికీ తెలియదు.
మూడు విగ్రహాల్లో ఒక విగ్రహం తెల్లటి పాలరాతితో చెక్కిన విషయం తెలిసిందే. ఇక మూడో రాముడి విగ్రహం విషయానికొస్తే ఈ విగ్రహాన్ని నల్లరాతితో బాలరాముని రూపంలో చెక్కారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు చెందిన శిల్పి జిఎస్ భట్ ఈ విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తారట. కానీ ఏ అంతస్తులో అన్న విషయం పై స్పష్టత లేదు. శ్రీరామ చంద్రుని మూడో విగ్రహంలో కుడి చేతిలో బాణం, ఎడమచేతిలో విల్లు ధరించి దర్శనం ఇస్తున్నారు. విల్లు, బాణం కూడా విగ్రహం లాగే నలుపు రంగులో ఉన్నాయి.
రెండవ విగ్రహం..
శ్రీరామ చంద్రుని రెండవ విగ్రహం పాలరాతితో చెక్కడం వలన తెలుపు రంగులో ఉంటుంది. శిల్పి సత్య నారాయణ్ పాండే ఈ విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహంలో రాముని నగలు బంగారు రంగులో కనిపిస్తాయి. అలాగే విగ్రహం పాదాల వద్ద హనుమంతుడు దర్శనం ఇస్తున్నాడు. అలాగే గౌతమ బుద్దుడు, పరశురాముడు కూడా ఈ విగ్రహంలో దర్శనం ఇస్తారు.