Entertainment

బావ ‘ఊసరవెల్లి’.. బామ్మర్ది ‘మ్యాడ్’


జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ‘ఊసరవెల్లి’ సినిమాకి ప్రత్యేక స్థానముంటుంది. ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2011 అక్టోబర్ 6న విడుదలై ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర నిర్మించిన ఈ మూవీ థియేటర్లలో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోనప్పటికీ.. తర్వాత కాలంలో మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్ సీన్ టాలీవుడ్ లో బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకి, ఇందులోని సన్నివేశాలకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ సినిమా విడుదలై నేటికి 12 వసంతాలు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు సరిగ్గా ఇదే తేదీకి ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం కావడం.

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’తో నార్నే నితిన్ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో నితిన్ తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ కూడా హీరోలుగా నటించారు. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కామెడీ అదిరిపోయిందంటూ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. అలాగే నార్నే నితిన్ కూడా తన యాక్షన్, డ్యాన్స్ లతో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తున్నాడు. మొత్తానికి 12 ఏళ్ళ క్రితం బావ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’తో రికార్డు ఓపెనింగ్స్ సాధిస్తే, ఇప్పుడు బావమరిది నార్నే నితిన్ ‘మ్యాడ్’తో సాలిడ్ ఎంట్రీ ఇచ్చాడు.



Source link

Related posts

తాత పాత్రలో జూనియర్ ఎన్టీఆర్!

Oknews

పబ్బులో ఘర్షణ.. రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి

Oknews

టాలీవుడ్‌కి టాప్‌ డైరెక్టర్లను పరిచయం చేసిన ఘనత మాస్‌ రాజా రవితేజదే!

Oknews

Leave a Comment