Bigg Boss : బిగ్ బాస్ ఉచ్చులో ఖమ్మం జిల్లాకు చెందిన ఒక యాంకర్ చిక్కుకుంది. బిగ్ బాస్ షోలో అవకాశం కోసం ఓ మధ్యవర్తికి డబ్బులు ఇచ్చి మోసపోయింది. అవకాశం కల్పిస్తానంటూ కాలయాపన చేసి చివరికి చేతులెత్తేయడంతో ఆ యాంకర్ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. తనను బిగ్ బాస్-7లోకి పంపిస్తానంటూ డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ స్వప్న అనే యాంకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న చౌదరి అలియాస్ స్వప్న యాంకర్‌గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా టాలీవుడ్‌లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా పంపిస్తానని మా టీవీలో ప్రొడక్షన్ ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్న సత్య బిగ్‌బాస్ ఇన్ ఛార్జ్ తమిలి రాజును పరిచయం చేశారు.
Source link
previous post