GossipsLatest News

బీజేపీలోకి రండి.. టికెట్స్ తీసుకోండి..!


జాతీయ పార్టీ బీజేపీకి అభ్యర్థులు కావలెను!

పేరుకే బీజేపీ జాతీయ పార్టీ.. పైగా కేంద్రంలో అధికారంలో కూడా ఉంది. ఒకసారి కాదండోయ్.. వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నాలే జరుగుతున్నాయి. ఎట్టి పరస్థితుల్లోనైనా దేశ వ్యాప్తంగా 400 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు కమలనాథులు.

ఇవన్నీ సరే కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం అభ్యర్థులు దొరక్క నానా తిప్పలు పడుతున్న పరిస్థితి. తెలంగాణతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులు లేరు. ఎంతసేపూ ఆ పార్టీ నుంచి.. ఈ పార్టీ నుంచి వచ్చిన వారికే టికెట్స్ ఇస్తున్నారు. 

ఇదీ సంగతి..

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఐతే ఇదే జోరుతో పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా కొట్టాలని బీజేపీ చూస్తోంది. రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు మాత్రం కరువయ్యారు. ఇప్పటి వరకూ పలువురు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. బూతద్దం పెట్టి చూసినా ఒక్కరంటే ఒక్కరూ బీజేపీ, ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోల్లు లేరు. దీంతో పార్టీ సిద్ధాంతాలకు బీజేపీ తిలోదకాలు ఇచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదిగో లెక్కలు..!

ఎంతమంది కట్టర్ బీజేపీ నేతలకు.. పార్టీకోసం పనిచేసిన వారికి టికెట్లు దక్కాయి అనేది ఇపుడు చూద్దాం.

1. నిజామాబాద్ : అరవింద్ ధర్మపురి (2017లో బీజేపీలో చేరిక)

2. మల్కాజిగిరి : ఈటల రాజేందర్ (2021లో బీజేపీలో చేరిక)

3. చేవెళ్ల : కొండా విశ్వేశ్వర్ రెడ్డి  (2022లో బీజేపీలో చేరిక)

4. భువనగిరి : బూర నర్సయ్య గౌడ్ (2022లో బీజేపీలో చేరిక)

5. జహీరాబాద్ : బీబీ పాటిల్ (2024లో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిక

6. నాగర్ కర్నూల్ : పోతుగంటి భరత్ ప్రసాద్ (2024లో బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ రాములు కుమారుడే ప్రసాద్)

7. హైదరాబాద్ : డా. మాధవీలత (ఈమె సోషల్ వర్కర్.. విరించి ఆస్పత్రి వైస్ ఛైర్మెన్)

8. సికింద్రాబాద్ : కిషన్ రెడ్డి (అరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్)

9. కరీంనగర్ : బండి సంజయ్

తొలి జాబితాలోని తొమ్మిది అభ్యర్థుల్లో ఏడుగురు జంపింగ్ అభ్యర్థులే కావడం గమనార్హం. పార్టీ మారిన వారికే తప్ప సిద్దాంతాలు నమ్ముకున్న వారికి మొండి చేయి చూపింది బీజేపీ. ఐతే పార్టీనే నమ్ముకుని ఉన్న మురళీధర్ రావు, పేరాల శేఖర్ లాంటి పార్టీకి లాయలిస్ట్‌గా ఉన్నవారికి మాత్రం మొండి హస్తం చూపించారు అగ్రనేతలు. పదేళ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా మురళీధర్ రావుకి చిన్నపాటి పదవి కూడా రాలేదు. వాస్తవానికి రెండేండ్ల కింద రాజ్య సభ ఎంపీ ఆశిస్తే బీసీ కోటా కింద లక్ష్మణ్‌కు కేటాయించగా.. ఇప్పుడేమో మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఆశించిన మురళికి అధిష్టానం మళ్లీ హ్యాండ్ ఇచ్చి ఈటెల రాజేందర్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో మురళీధర్ రావు మనస్తాపం చెందినట్లు సమాచారం. సిద్దాంతాలను నమ్ముకున్న సీనియర్ లీడర్ పేరాల శేఖర్ సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే ఆయనకి సైతం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదు. 

ఇక రెండో జాబితా విషయానికి వస్తే..!

1. ఆదిలాబాద్ : గోడెం నగేష్ (2024లో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిక)

2. పెద్దపల్లి : గోమాస శ్రీనివాస్ (2024లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిక)

3. నల్గొండ : శానంపూడి సైది రెడ్డి (2024లో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిక)

4. మహబూబాబాద్ : సీతారాం నాయక్ (2024లో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిక)

5. మహబూబ్ నగర్ : డీకే అరుణ (కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిక)

6). మెదక్ : రఘునందన్ రావు (టీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి చేరిక)

చూశారుగా.. మొదటి జాబితాలోనే అనుకుంటే బుధవారం రిలీజ్ చేసిన జాబితాలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. రాష్ట్రంలో బలపడాలి అనుకుంటున్న జాతీయ పార్టీ ఇలా చేస్తూ పోతే.. పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలు.. నేతలు మనోభావాలను దెబ్బ తీయకుండా.. వారి డిమాండ్స్ కూడా వింటే మంచిది మరి. గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇవ్వడం తప్పు కాదు కానీ ఇలా చేస్తూ పోతే.. పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు మరి. ఇంతలా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి ఎన్ని పార్లమెంట్ స్థానాలు దక్కుతాయనేది చూడాలి. ఇక ఏపీ గురుంచి ఐతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.



Source link

Related posts

V Prakash About CM Revanth Reddy | V Prakash About CM Revanth Reddy |దూకుడు రేవంత్ రెడ్డి కొంప ముంచే అవకాశముందా..?

Oknews

KTR Travels In Autorickshaw From Yousufguda To Telangana Bhavan

Oknews

అల్లరోడు ఈజ్ బ్యాక్.. 'ఆ ఒక్కటీ అడక్కు' అంటూ పెళ్లి గోల!

Oknews

Leave a Comment