Telangana

బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాం- మహేశ్వర్ రెడ్డి-hyderabad bjp mla maheshwar reddy fires on komatireddy criticizes topple congress govt in 48 hrs ,తెలంగాణ న్యూస్



రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా మా వద్ద ఉందిభువనగిరి ఎంపీ సీటును రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టెలిఫోన్‌ యాక్ట్‌ కేంద్రానికి సంబంధించిదని, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును(Phone Tapping Case) సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌ రెడ్డి వసూళ్ల చిట్టా తమవద్ద ఉందన్నారు. హైదరాబాద్‌ లో డబ్బులు వసూలు చేసి దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్‌ వాడుతుందని ఆరోపించారు. సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) గతంలో రంజిత్‌ రెడ్డిపై చేసిన ఆరోపణలు గుర్తులేదా? అని ప్రశ్నించారు. రంజిత్ రెడ్డి అవినీతిపరుడు అని ఆరోపించిన రేవంత్ ఇప్పుడు టికెట్ ఎలా ఇచ్చారని నిలదీశారు. లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) రంజిత్ రెడ్డికి ఓటు వేయాలని ఎలా అడుగుతారని నిలదీశారు. నితిన్‌ గడ్కరీ వద్దకు వెళ్లి తాను షిండే పాత్ర పోషిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నది వాస్తవమన్నారు. కాంగ్రెస్ లో సైతం కోమటిరెడ్డిపై ఎవరికీ నమ్మకం లేదన్నారు.



Source link

Related posts

Minister Seethakka: వెయ్యేళ్లు గుర్తుండేలా మేడారం శిలాశాసనాలు..వంద ఎకరాల్లో ఆలయం అభివృద్ధి చేస్తామన్న సీతక్క

Oknews

Supreme Court gives green signal to Telangana Police Constable Recruitment

Oknews

నారాయణఖేడ్ లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ, సొంత గూటికి మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి-narayankhed news in telugu brs leader ex mla vijaypal reddy joins bjp again ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment