Health Care

బీరు బాటిల్స్ ఎక్కువగా గ్రీన్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?


దిశ, ఫీచర్స్ : మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మద్యం తాగకూడదు అని మన పెద్దవారు ఇప్పటికీ చెబుతుంటారు. కానీ వారి మాట ఎవ్వరు వినరు. ముఖ్యంగా ఇప్పుడున్న యూత్ ఎక్కువగా బీర్లకు అలవాటు అయిపోయింది. డైలీ ఒక బీర్ తాగనిదే ఏ యువకుడు నిద్రపోవడం లేదు. ఇంట్లో ఉదయం లేవగానే టీ ఎలాగైతే తాగుతారో కొందరు బీర్ కూడా అదే విధంగా తాగుతుంటారు. ఇక పెళ్లీలు, ఫంక్షన్స్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కాటన్, కాటన్ బీర్ పెట్టలు వారి ఇంట్లో దిగాల్సిందే. ఇప్పుడున్న యూత్ అలా మారిపోయారు.

అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? బీర్ సీసాలు గ్రీన్ లేదా గోధమ రంగులోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అసలు బీర్ సీసాలు రెడ్, వైట్ లాంటి కలర్స్‌లో కాకుండా ఎక్కువగా గ్రీన్, బ్రౌన్ కలర్స్‌లో ఎందుకు ఉంటాయని మీరు ఆలోచించారా? ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

అయితే చాలా ఏళ్ల క్రితం బీర్‌ను పారదర్శక సీసాల్లో స్టోర్ చేసేవారంట. అయితే అవి సూర్యరశ్మికి గురైనప్పుడు ,UV కిరణాలు బీర్ లోపల ఉన్న రసాయన శాస్త్రాన్ని వేగంగా మార్చడాన్ని నిపుణులు గమనించారు. దాని వలన బీర్ టేస్టే మారిపోయిందంట. దీంతో వారు బీర్‌ను సూర్యరశ్మి నుంచి కాపాడటానికి కాంతిని చెదరగొట్టే వివిధ రంగులతో బీర్ సీసాలు తయారు చేశారు.

అందులో ముఖ్యంగా గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్ వలన సూర్యరశ్మి బీర్‌ సీసాల లోపలికి ప్రవేశించలేకపోయిందంట. దీంతో నిపుణులు మొదటగా బ్రౌన్ కలర్‌లో బీర్ సీసా తయారు చేసి అందులో బీర్ స్టోర్ చేయడం మొదలు పెట్టారు. దీంతో బీర్ ఎలాంటి రుచిని కోల్పోకుండా టెస్టీగా ఉందంట.మార్కెట్‌లోకి గోధుమ రంగు బీర్ సీసాలు వెళ్లడంతో దానికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందంట. ఆ క్రమంలోనే గ్రీన్ కలర్ సీసాల్లో కూడా బీర్ స్టోర్ చేసి అమ్మడం మొదలు పెట్టారు. గ్రీన్ కలర్ సీసాకు మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ రావడంతో ఎక్కువగా ఈ కలర్ సీసాల్లోనే బీర్ అమ్ముతున్నారంట. అలా ఈ రెండు రంగుల్లోనే బీర్ అమ్ముతుంటారు అంటున్నారు నిపుణులు.



Source link

Related posts

పర్పుల్ కలర్ లెహంగాలో రాధికా మర్చంట్.. ఏంజిల్‌లా ఉన్నావంటున్న నెటిజన్స్

Oknews

#JOMO .. ఈ నయా ట్రెండ్ ఏంటో తెలుసా?

Oknews

పిల్లలను కనండి రూ. 25 లక్షలు సంపాదించండి.. కంపెనీ వింత ఆఫర్‌

Oknews

Leave a Comment